ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొంతం చేసుకోవడంలో ప్రతిపక్షాల వైఖరి వేచి చూడాల్సిందే.....

ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొంతం చేసుకోవడంలో ప్రతిపక్షాల వైఖరి వేచి చూడాల్సిందే.....

ముద్ర,తెలంగాణ:-తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ఇటీవల పలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నప్పటికీ వారిపై ఉన్న ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిని వేచి చూడాల్సిందే. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమలు కానీ హామీలతో పాటు సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగడంతో పాటు సంక్షేమ పథకాల అమలులో చేతివాటాలు. భూ కబ్జాలు. అక్రమ వసూళ్లు. వారి అనుచరుల ఆగడాలను సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత కంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల పై ఉన్న ప్రజల వ్యతిరేకతే ఎక్కువ అని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొన్నది. కర్ణాటక శాసనసభ ఫలితాల కంటే ముందు రాష్ట్రంలో బిజెపి బిఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ప్రకటించుకున్నప్పటికీ కర్ణాటక ఫలితాలలో బిజెపి ఓడిపోవడంతో రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులే గగనమైపోయిన పరిస్థితి నెలకొన్నది.

రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా అడ్డుకుంటామని గొప్పలు చెప్పిన బిజెపి రాష్ట్ర నాయకత్వం చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని అర్బన్ ప్రాంతాలలో బలంగా బిజెపి ఉన్నప్పటికీ మిగతా అనేక చోట్లలో బలహీనంగా ఉండడం ఉనికి కోసం పోటీ చేసే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రానున్న ఎన్నికలలో బిజెపి ప్రస్తుతం ఉన్న స్థానాలలో గెలవడమే కష్టంగా మారింది. ఈ పరిణామాలు బిజెపి అధికారంలోకి వస్తుందని అంచనాలైతే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో లేవు. అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో సహజంగా సొంత పార్టీ సభ్యులు ఓడిపోవాలి. నేనొక్కడినే గెలిచి ముఖ్యమంత్రి పీఠం అందుకోవాలనే చాదస్తపు. వ్యక్తిగత స్వలాభం మార్చుకోలేని నేతల తీరు. ప్రత్యర్థి పార్టీ గెలిచినా సంతోషమే కానీ తన కుర్చీకి పోతివచ్చే సొంత పార్టీ నేత ఓడిపోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల అంతర్గత కుట్రపూరిత రాజకీయాలను పక్కన పెట్టి కర్ణాటక ఫలితాల తర్వాత ఏర్పడిన మనోధైర్యంతో కాంగ్రెస్ పార్టీలో రెండు రోజుల చేరికలతో హడావిడి చేసి ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ముందుకు వచ్చింది. తదనంతరం కథ మళ్ళీ మొదటికి వచ్చి పార్టీలో చేరికలు.

తగాదాలను నేతలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం నెలకొన్న సహజ పరిస్థితులలో ఒక రాజకీయ పార్టీ అభ్యర్థి గెలవాలంటే అంగ బలమే కాకుండా అర్థబలం కూడా తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గులాబీ బాస్ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల మీద దిబ్బకొడుతూ ఉన్న వారి రాజకీయ పార్టీల అధిష్టానం లో చలనం ఉండకపోవడంతో ప్రత్యర్థి రాజకీయ పార్టీల తరపున గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులు చేజారుతున్న ఆయా పార్టీల అధిష్టానాలలో చలనం లేకపోవడం దురదృష్టకరం. వారిని ఆపాలనే ఆలోచన లేకుండా ఉండడంతో గులాబీ దళపతి గెలుపు గుర్రాలకు గాలం వేస్తూ మరోసారి అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను వీడకుండా అడ్డుకట్ట వేయడంలో విఫలం అవుతూనే ఉన్నారు. బిగ్ షాట్లకు బిగ్ షాక్ ఇస్తున్న వారిని కనీసం బుజ్జగించే పనిలో పార్టీలు ఉండడంతో ఆ దశ తీవ్ర దశకు వెళుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గులాబీ బాస్ ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఎందుకు మౌనంగా ఉందో ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడోసారి అధికారంలోకి రావడానికి కల్వకుంట్ల కుటుంబం తమ వస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రస్తుత తరుణంలో నీళ్లు. నిధులు. నియమకాలు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. నిరుద్యోగ యువత వేతలు లాంటి విషయాలు చెప్పుకోవడానికి ఉన్న అస్త్రాలు. అది కూడా పూర్తిస్థాయిలో అనుకూలిస్తాయని గ్యారంటీ లాజిక్ 2018 ఎన్నికలలోనే తేలిపోయింది. కనీసం అప్పటి అనుభవాన్ని పాఠంగా మలుచుకోలేక హస్తం పార్టీ హాస్యాస్యమైపోతుంది అని రాజకీయ విమర్శకులు ఆరోపిస్తున్నారు.

ప్రజా వ్యతిరేకత మాకు కలిసి వస్తుంది అనుకుంటే మబ్బులు చూసి ముంతలో నీళ్లు పారబోసినట్లు గా ఉన్న సామెతను కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు గమనించాలని సూచిస్తున్నారు. ఓటర్ల నాది పట్టడంలో గులాబీ బాస్ రూటే సపరేటు. ఆయన వ్యూహం పసిగట్టడంలో ప్రత్యర్థుల దగ్గర ఎత్తులు లేని లేవు అనేది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేలకు మంచి పాఠం. అనుభవాన్ని నేర్పింది. ఫోన్ మేనేజ్మెంట్ను బాగా వంట పట్టించుకుంది. అందులోనూ వారు ఈ పదేళ్లలో ఆర్థికంగా చాలా బలపడ్డారు. అదే క్రమంలో ప్రతిపక్ష నేతలను బలహీనం చేస్తూ ముందుకు వెళుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఆర్థిక మూలల మీద దెబ్బ కొట్టడంలో వారు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను సొమ్ము చేసుకుని ప్రజలంతా ముక్కుమ్మడిగా దాడి చేస్తే తప్ప ఇప్పుడు ప్రతిపక్ష అభ్యర్థులు గట్టెక్కే అవకాశాలు లేనే లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులలో ఐదేళ్ల పాలన గాలికి వదిలేసిన. ఎన్ని అక్రమాలు చేసిన. ఐదు రోజుల పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయితే తప్ప అధికారం ఎవరి సొంతం కాదు. అందుకే అనేక రాజకీయ ఉద్దండకులు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిందే తప్ప ఎదురు పోవద్దని కిందిస్థాయి నేతలకు ముందు నుండి సూచిస్తూ వస్తున్నారు. నిజాలు చేదుగా అనిపిస్తున్న ప్రస్తుతం నెలకొన్న రాజకీయాలను గమనించే ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొంది..

  • వ్యాస రచయిత

మంగ వెంకటేష్.
మాజీ సిపిఎం నాయకులు ఆలేరు.....