ఓట్ల కోసమే సంబరాలు..

ఓట్ల కోసమే సంబరాలు..
  • జూరాల ద్వారానే కర్వేనా ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయాలి.
  • మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా:  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మిస్తున్న కర్వేన రిజర్వాయర్ కు జూరాల ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయాలని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ అనుమతుల పేరుతో అధికార పార్టీ నేతలు సంబరాలు జరుపుకోవడం ఓట్ల కోసమేనని విమర్శించారు. ప్రాజెక్టు పనులను ప్రారంభించి 84 నెలలు గడుస్తున్న 30 నెలలలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రతి మనిషికి గుండెకాయ ఎంత అవసరమో ప్రాజెక్టులకు కాలువలు అంతే అవసరమని కాలువలు నిర్మించకుండా ప్రాజెక్టులు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకోవడం ముఖ్యమంత్రి ఈ తగదని హెచ్చరించారు.

ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే లిఫ్టులు కాలువలు టన్నెల్స్ సర్జిపుల్స్ నిర్మాణాలు పూర్తిచేయాలని కానీ ఇవేవీ చేయకుండా పూర్తిస్థాయిలో ప్రాజెక్టులు పూర్తయ్యాయని ప్రకటించుకోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి అండగండ్లతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటున్నారని శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరవడం దారుణమని ప్రాజెక్టు టెండర్లలో పారదర్శకత లోపించి ందని అన్నారు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని ఆయన సంబరాలు చేసుకోవడం కాంట్రాక్టర్ల కోసమేనని అన్నారు ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి మండల పార్టీ అధ్యక్షులు కోటయ్య మునిసిపాలిటీ అధ్యక్షులు పాండు తాడూరు మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు నాయకులు సుల్తాన్ అహ్మద్ భీముడు తదితరులు పాల్గొన్నారు.