సమస్యలు పరిష్కరించి ఎమ్మెల్యే చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి

సమస్యలు పరిష్కరించి ఎమ్మెల్యే చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
  •  బంగారు తెలంగాణలో మరుగుదొడ్డిలో నివాసమా.    
  •  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొండా మణెమ్మ నగేష్.  

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ జిల్లా: మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొండా మణెమ్మ నాగేష్ బిజినపల్లి మండలంలోని వట్టెం గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు 500 కు పైగా కుటుంబాలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  వట్టెం  గ్రామం సమస్యలకు నిలయంగా మారిందని గ్రామంలో భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని అదేవిధంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టి మంజూరు చేయడంతో పాటు మూడు ఎకరాల వ్యవసాయ భూ పంపిణీ చేపట్టి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే ఇటీవల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల పేరుతో ఆర్భాటాలు చేయడం తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని గ్రామంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో శంకుస్థాపనలకు వేసిన పూలమాలలు తీసుకువచ్చి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు వేయడం దారుణమని వెంటనే ఈ ప్రాంత ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామంలో అనేకమంది అర్హులు ఉన్నప్పటికీ వికలాంగుల పెన్షన్ మంజూరు చేయడం లేదని నిబంధనలను సాకుగా చూపి అన్న రోజులుగా ప్రకటించడం దారుణమని మండిపడ్డారు ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయలేదని రెండు కుటుంబాలు మరుగుదొడ్డిలోనే జీవనం సాగిస్తున్నాయని ఇదే నా బంగారు తెలంగాణ అని నిలదీశారు.

సమస్యలను పరిష్కరించిన తర్వాతే గ్రామాలలో పర్యటించాలని ఆమె ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు నగేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ప్రజలు మేల్కొని బిజెపి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ప్రభుత్వ ఏర్పాటుతోనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు గ్రామంలో సుమారు 450 కుటుంబాలకు వివాహ గృహాలు లేవని వివరించారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు శంకర్ ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెకాడి లక్ష్మణ్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ శర్మ కిసాన్ మోర్చా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఇంద్రసేనారెడ్డి సాయిబాబా శేఖర్ చారి, చిన్న రాయుడు రాజు తదితరులు పాల్గొన్నారు.