బియ్యo గింజ ఆకారంలో చంద్రయాన్ 3 

బియ్యo గింజ ఆకారంలో చంద్రయాన్ 3 
  • అమ్రాబాద్ నల్లమల యువ స్వర్ణ కారుడి అద్భుత తయారీ

ముద్ర  అచ్చంపేట:-నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపికృష్ణ చంద్ర యాన్ 3 ని బంగారంతో బియ్యపు గింజంతా సైజులో  తయారుచేసి మరోసారి తన కళను ప్రదర్శించారు.ఆమ్రాబాద్ మండల కేంద్రంకు చెందిన యూవ స్వర్ణ కారుడై న  గోపికృష్ణ అతి సూక్ష్మ కళలపట్ల మక్కువతో బంగారంతో గతంలో  ఎన్నో నమూనాలను తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు.

ఈ రోజు సాయంత్రం చంద్రునిపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో 450 మిల్లి గ్రాముల బంగారంతో బియ్యం గింజ సైజులో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను తయారు చేశాడు.వీటిని తయారుచేయడం కోసం ఒక్క రోజు  సమయం పట్టిందని గోపిచంద్ తెలిపారు. అతి  సూక్ష్మంగా ఉన్న కళను వెలికి తీయాలని ఉద్దేశంతో వీటిని తయారు చేయడం జరిగిందని తెలిపారు చంద్రయాన్-3 విజయవంతం కావాలని గోపీచంద్  ఆకాంక్షించారు.గతంలో బంగారం ఉపయోగించి అతి సూక్ష్మంగా భారతదేశ ఛిత్రపటంను చంద్రయాన్-2 రాకెట్ నమూనాను,జాతీయ జెండాను తయారుచేశారు. గోపీచంద్ కళలపట్ల అమ్రాబాద్ ప్రజలు హార్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.