కోదాడ బిఆర్ఎస్ అభ్యర్థిని మార్చకపోతే.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం.

కోదాడ బిఆర్ఎస్ అభ్యర్థిని మార్చకపోతే.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం.
  • మల్లయ్య యాదవ్ ను  ప్రోత్సహిస్తే.. అవినీతి, అక్రమాలను ప్రోత్సహించినట్లే.
  • ప్రజాభిష్టం మేరకు అభ్యర్థి మార్పు అవసరం
  •  కోదాడ అసెంబ్లీ అభ్యర్థిని పునః పరిశీలించాలని ప్రజా ప్రతినిధుల సంతకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ
  • శశిధర్ రెడ్డి... వేనేపల్లి చందర్రావు, ఎర్నేని బాబు...ముత్తవరపు పాండురంగారావు.. వనపర్తి శిరీష లక్ష్మి నారాయణ.

ముద్ర కోదాడ:-రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి స్థానిక ఎమ్మెల్యేను అభ్యర్థిగా ప్రకటించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు నియోజకవర్గ పరిధిలోని వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు, ప్రజల అబిష్టానికి వ్యతిరేకంగా అధినేత కేసిఆర్ స్థానిక ఎమ్మెల్యేను అభ్యర్థిగా ప్రకటించడాన్ని సరైనది కాదని,  గత నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి,  అక్రమాలు, దుర్వినియోగమువుతున్న ప్రజాధనం, కాంట్రాక్టుల్లో కమిషన్లు, ప్రజా ప్రతినిధుల వద్ద కమిషన్లు.. సొంత నాయకులపై కేసులు,మహిళా ప్రజాప్రతినిధులను అవమానపరచడం వంటి వాటిని అధిష్టానం సమర్ధించినట్లుగా ప్రజలు భావిస్తున్నందున అధినేత కేసీఆర్ ప్రకటించిన స్థానిక అభ్యర్థిని మార్చాలని బుధవారం కోదాడలో సమావేశమైన ప్రస్తుత ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ వ్యతిరేక వర్గం నాయకులు కోరుతున్నారు ఈ మేరకు బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం సమావేశం నిర్వహించింది.

కోదాడ నియోజకవర్గంలో ప్రజాభిస్టం మేరకు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించి కోదాడలో గులాబీ జెండా ఎగరవేస్తామని భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి ఏర్నేని వెంకటరత్నం బాబు, డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ లు అన్నారు. బుధవారం స్థానిక   పెరిక భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపీటీసీలు మాజీ మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులతో కలిసి మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా కోదాడ నియోజకవర్గంలో అనేక రకాల దంధాలు నిర్వహిస్తూ అటు ప్రజలను ఇటు ప్రజాప్రతినిధులను సొంత పార్టీ నాయకులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న స్థానిక ఎమ్మెల్యేను మరల అభ్యర్థిగా ప్రకటించడాన్ని ప్రజలు విశ్వసించడం లేదని. ముఖ్యమంత్రి  స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిత్వం పై పునః పరిశీలించి, ప్రజామోదయోగ్యమైన అభ్యర్థిని ప్రకటించాలని కోరారు.  లేనిపక్షంలో తమ పదవులకు రాజీనామాలు చేయడానికి సిద్ధమని తెలిపారు.

ఈ మీడియా సమావేశంలో మోతే ఎంపీపీ ముప్పాని ఆశా శ్రీకాంత్ రెడ్డి, చిలుకూరు ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య, చిలుకూరు జెడ్పిటిసి బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, అనంతగిరి జెడ్పిటిసి కొనతం ఉమా శ్రీనివాసరెడ్డి, రాయపూడి వెంకటనారాయణ రైతు సమన్వయ సమితి  జిల్లా సభ్యులు, నాగిరెడ్డి లింగారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు, మైనంపాటి గురువారెడ్డి మోతి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, గుండపునేని పద్మ నాగేశ్వరరావు తీపిరిశెట్టి సుశీల రాజు, పెందెం వెంకటేశ్వర్లు, ( కోదాడ మున్సిపల్ కౌన్సిలర్స్ ),మద్ది పద్మ వెంకటరెడ్డి ఎంపిటిసి జరిపోతులగూడెం, నూకల యుగంధర్ రెడ్డి సర్పంచి కర్కాయ గూడెం ,పుల్లూరి అచ్చయ్య జెడ్పిటిసి మాజీ చిలుకూరు ,పిడమర్తి రమేష్ బాబు మాజీ ఎంపీపీ కోదాడ, టి రామయ్య మాజీ ఎంపీపీ చిలుకూరు, కమతం వెంకటయ్య కోదాడ డైరెక్టర్ పి ఎస్ ఎస్, పిడమర్తి బ్రహ్మం ఎంపీటీసీ మాజీ రెడ్ల కుంట, అనంతల మహేష్ గౌడ్ మండల మాజీ అధ్యక్షులు నడిగూడెం ,బెల్లంకొండ ప్రభాకర్ మండల మాజీ అధ్యక్షులు చిలుకూరు ,తుపాకుల భాస్కర్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మునగాల ,రామినేని సత్యనారాయణ, బూర ఆంజనేయులు నారాయణపురం మాజీ సర్పంచ్, వేనేపల్లి సత్యనారాయణ ,గుండపునేని కొండలరావు ,రాయి రవి ,గుండు విజయ రామారావు ,గుండు సతీష్ ,దున్న ప్రవీణ్, యుగంధర్ శేషన్న యువసేన నాయకులు ,కాసాని శివ ,అప్పిరెడ్డి తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.