దళితబంధు అవినీతి పై ఎంక్వయిరీ గుడిబండ నుండి మొదలుపెట్టాలి....

దళితబంధు అవినీతి పై ఎంక్వయిరీ గుడిబండ నుండి మొదలుపెట్టాలి....

కోదాడ, ముద్ర:దళిత బంధు లో జరిగిన అవినీతిపై ఎంక్వయిరీ  గుడిబడ గ్రామం నుండి మొదలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో రాజీవ్ గాంధీ 32 వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారిపై ఉన్న రాజీవ్ గాం ధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన టిఆర్ఎస్ పార్టీపై ఘాటుగా విమర్శలు చేశారు. అభివృద్ధి మొత్తం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని అన్నారు. గుడిబండ గ్రామంలో కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం పార్టీలు వీడారని అట్టడుగు వర్గాలు కార్యకర్తలు మనతోనే ఉన్నారని అన్నారు.

కెసిఆర్ కేటీఆర్ తండ్రి కొడుకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని అంటున్నారు అని నాగార్జునసాగర్ ఎవరు కట్టించారని ఆ సాగర్ క్రింద ఎన్ని పొలాలు పండుతున్నాయని ఎన్ని మిల్లులు ఉన్నాయని వివరాలు తెలియవా అని ప్రశ్న గాటుగా ప్రశ్నించారు. కెసిఆర్ కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 105 స్థానాలు గెలుస్తామని అంటున్నారని 105 కాదు ఐదు స్థానాలు ఎక్కడ గెలుస్తారొనని ఎత్తుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఉన్న టిఆర్ఎస్ నాయకులు మట్టి, వైన్స్, సాండ్, ల్యాండ్ దందా సాగిస్తున్నారని విమర్శించారు. అవినీతి నిజం కాకపోతే కాంగ్రెస్ పార్టీ వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరుతానని అన్నారు. గుడిబండ గ్రామంలో 13 ఎకరాల స్థలాన్ని పేద ప్రజలకు ఇవ్వడానికి తీసుకువస్తే ఆస్థానాన్ని కూడా ప్రభుత్వం వదలలేదని క్రీడామైదానం, ఉద్యానవనాలకు ఏర్పాటు చేశారని అన్నారు.

ఐదు నెలల్లో కాంగ్రెస్ పార్టీ వస్తదని ఆ 13 ఎకరాల స్థలాన్ని నా ప్రాణాన్ని అడ్డువేసిన పేదలకు పంపిణీ చేస్తానని అన్నారు. గ్రామంలో కార్యకర్తలు ఉంటే ఒక వైపే ఉండండి అటు ఇటు ఉంటే ఉత్తంకుమార్ రెడ్డి గ్రామంలోకి వచ్చిన నేను మాట వినను అని అన్నారు. ఈసారి ఎన్నికలలో  మండలంలో అత్యధిక మెజార్టీ వస్తుందని తెలిపారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు ఈసారి ఎలా జరిగితే అనేక మంది తో జైల్ బరో కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. 5 నెలల్లో అవినీతి ప్రభుత్వాన్ని తరిమేద్దామని కార్యకర్తలకు అయినా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  పిఎసిఎస్ డైరెక్టర్ ఓ శ్రీనివాసరెడ్డి, ప్రసాద్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, జానీ,గ్రామ శాఖ అధ్యక్షులు రఫీ , మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, కుక్కడపు సైదులు,నాగ శేషు గౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.