ఈనెల 20న సూర్యాపేటలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాలి

ఈనెల 20న సూర్యాపేటలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాలి

తుంగతుర్తి ముద్ర: ఈనెల 20న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు కోరారు. బుధవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యేడాక్టర్ గాదరి కిషోర్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రారంభించి, అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. మండలం నుంచి సుమారు 3వేల మందిని తరలించేందుకు  కృషిచేస్తామని అన్నారు.

బి ఆర్ ఎస్  పార్టీ కార్యకర్తలు  ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి బహిరంగ సభను  విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ  నాయకులు గుండగాని రాములు గౌడ్, కటకం వెంకటేశ్వర్లు, దొంగరి శ్రీనివాస్, పులుసు వెంకటనారాయణ గౌడ్, బత్తుల జలంధర్, గుండగాని దుర్గయ్య, నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.