డ్రం సీడర్  ద్వారా వరి సాగు చేస్తున్న రైతులు

డ్రం సీడర్  ద్వారా వరి సాగు చేస్తున్న రైతులు
  • వర్షాలు కురుస్తుండడంతో వరి సాగుపై దృష్టి పెట్టిన రైతులు

తుంగతుర్తి,ముద్ర:-ఈ ఏడాది వర్షాకాలం సీజన్లో వర్షాలు సకాలంలో కురువక రైతులు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు .వరి నారులు పోయడానికి సరైన వర్షాలు లేకపోవడం తీవ్రమైన ఎండల ప్రభావంతో రైతులు వరి నారులు పోయలేదు. గత నాలుగు ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో కొంతమంది రైతులు  వరి నార్లు పోస్తుండగా మరికొంతమంది రైతులు పొలాలను దున్ని డ్రం  సిడర్ ద్వారా మరికొంతమంది రైతులు నేరుగా వరి విత్తనాలను వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు.నిన్న మొన్నటి వరకు విత్తనాలు అమ్మకం లేక వేలవేల పోతున్న విత్తన దుకాణాలు నేడు రైతుల వరి విత్తనాల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి .ఇప్పటికే అధిక శాతం మంది రైతులు వరినారులు పోశారు. ఈసారి నార్లు పోయడం కొంతమేర ఆలస్యం కావడంతో వరి నాట్లు కూడా ఆలస్యం అవుతాయని రైతులు అంటున్నారు. ఏది ఏమైనా వర్షాలు కురుస్తుండడంతో రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.