పనులలో వేగం పెంచాలి: జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు

పనులలో వేగం పెంచాలి: జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు

 మెడికల్ కాలేజీ ఆవరణ సుందరంగా తీర్చిద్దిద్దాలి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 24న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా ప్రారంభం ప్రభుత్వ కార్యాలయాల పనులలో వేగం పెంచి ప్రారంభోత్సవనికి సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు ఆదేశించారు. మంగళవారం నూతన సమీకృతా కలెక్టరేట్ కార్యాలయం, పోలీస్ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృతా మార్కెట్ లను జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాక సందర్భంగా వైద్య కళాశాలను సుందరంగా తీర్చిదిద్దాలని కళాశాల ఆవరణలో పూల మొక్కలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

నూతన జిల్లా పోలీసు కార్యాలయంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఎక్కడ అపరిశుభ్రంగా ఉండకూడదని తెలిపారు. ముఖ్యంగా కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటించి పచ్చదనంతో ప్రణమిల్లాలన్నారు. వెజిటేరియన్ మార్కెట్ నందు ఆకుకూరలు, కాయగూరలు పైన పెట్టుకొని అమ్ముకునే విధంగా ఏర్పాటు చేస్తున్న స్టాండ్లను కలెక్టర్లు పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆవరణలో సరికొత్త మొక్కలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రామంజుల రెడ్డిని ఆదేశించారు. అనంతరం సూర్యాపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని ,డిటిఓ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆర్డీవో కార్యాలయంలో సెక్షన్ల వారిగా ఉన్న గదులను పరిశీలించారు. సిబ్బంది వివరాలను కార్యాలయ సూపరెండేంట్ ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని పరిశీలించి కార్యాలయం ఫర్నిచర్, ఫైల్స్ , బిల్లులను ఒక క్రమ పద్ధతిలో నూతన కలెక్టరేట్ కార్యాక్రమంలో మార్చుకోవాలని డిటిఓ రవికుమార్ కు సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.