వికలాంగుల హక్కుల చట్టం 2016 ను సమర్థవంతంగా అమలు చేయాలి

వికలాంగుల హక్కుల చట్టం 2016 ను సమర్థవంతంగా అమలు చేయాలి

 * కోదాడ డిఎస్పీ ప్రకాష్ యాదవ్ కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి , కోదాడ: కేంద్ర ప్రభుత్వం 2016లో వికలాంగుల రక్షణ కోసం తీసుకువచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 ను సమర్థవంతంగా అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కోదాడ నూతన DSP గా నియమితులైన ప్రకాష్ యాదవ్ ను కలసి విజ్ఞప్తి చేశారు . శనివారం సంఘం నేతలతో కలిసి నూతన DSP గా బాధ్యతలు స్వీకరించిన ప్రకాష్ యాదవ్ ని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపి అనంతరం వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నూతన డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు . రాష్ట్రంలో వికలాంగులపై రోజురోజుకు దాడులు ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని అభం శుభం తెలియని మానసిక వికలాంగురాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయని రాష్ట్రంలో గౌరవప్రదమైన ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్న సర్పంచ్ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ప్రజా ప్రతినిధులు వికలాంగులను వైకల్యం పేరుతో దూషించడం దాడులకు పాల్పడుతుండటం , తమను ఎంతో బాధిస్తుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కొల్లూరి ఈదయ్య బాబు , సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్ , సంఘం మునగాల మండల నాయకులు గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి , సంఘం జిల్లా నాయకులు పిల్లుట్ల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.