కక్షలు కార్పన్యాల వైపు నుండి అభివృద్ధి దిశగా పయనిస్తున్న తుంగతుర్తి

కక్షలు కార్పన్యాల వైపు నుండి అభివృద్ధి దిశగా పయనిస్తున్న తుంగతుర్తి
  • రక్తపుటేరులు పారిన నెలలో  నేడు  గోదావరి జలాలు
  • యువత ఉపాధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

తుంగతుర్తి ముద్ర: తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధి సాధిస్తూ అభివృద్ధిలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని తుంగతుర్తి శాసనసభ్యులు   డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు .సోమవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన2కె 2కె రన్ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు అనాదిగా అభివృద్ధికి నోచుకోకుండా కక్షలు కార్పన్యాలతో హత్యలు ధమన కాండలతో ఉద్రిక్తంగా ఉండే తుంగతుర్తి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గత పది సంవత్సరాలుగా ఎలాంటి కక్షలు కార్పన్యాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉందని ఎమ్మెల్యే అన్నారు .తాను ఎమ్మెల్యే కాకముందు నియోజకవర్గంలో ఎన్ని ఘర్షణలు ఎన్ని హత్య రాజకీయాలు ఎన్ని పోలీస్ కేసులు నమోదయో తాను ఎమ్మెల్యే అయిన అనంతరం ఎన్ని రాజకీయ కేసును నమోదు అయ్యాయో పరిశీలించాలని అన్నారు.

ఎలాంటి రాజకీయ కక్షలకు తావు లేకుండా రాజకీయాల కతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నామని అన్నారు .ముఖ్యంగా యువత చెడు తోవలకు వెళ్లకుండా వారికి సరి అయిన దిశానిర్దేశం చేస్తూ ప్రభుత్వ పాలన సాగుతుందని అన్నారు .గతంలో తుంగతుర్తి నియోజకవర్గంలో గ్రామాల్లో రక్తం ఏరులై పారగా నేడు నియోజకవర్గంలో గోదావరి జలాలు అన్ని గ్రామాల్లో ప్రవహిస్తూ ప్రజలకు చేతినిండా పని కల్పిస్తూ బీడు భూములు సస్య  శ్యామలం చేసి నియోజకవర్గంలో సంతోషకరమైన వాతావరణ కల్పించామని ఎమ్మెల్యే అన్నారు .నియోజకవర్గంలో సాగు తాగునీటి సౌకర్యం కల్పించి ప్రజల ఆశీస్సులతో రెండుసార్లు విజయం సాధించామని అది తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదమేనని అన్నారు .నియోజకవర్గాన్ని  అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకోవడమే తన ముందున్న లక్ష్యం అని అన్నారు .అందుకోసం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పర్యటిస్తూ ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను అక్కడి ప్రజల నుండి తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు .

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో ఉందని రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేసి తుంగతుర్తి నియోజకవర్గ దశ దిశను మార్చడం జరుగుతుందని అన్నారు .ఎమ్మెల్యేగా తాను గెలిచిన అనంతరం గతంలో ఏ శాసనసభ్యుడు నియోజకవర్గంలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టలేదని తాను చేపట్టి పల్లెల్లోని సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించామని అన్నారు రాష్ట్రంలో ప్రజా పాలన అభివృద్ధి సంక్షేమ పాలన చక్కగా సాగుతుందని ప్రజలు సరైన సమయంలో అభివృద్ధి చేస్తున్న వారికి అండగా నిలవాలని అభివృద్ధి నిరోధకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు  టూ కె రన్ కార్యక్రమానికి వందలాదిగా తరలివచ్చిన యువకులకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన పోలీస్ శాఖ అధికారులకు ఇతర శాఖల అధికారులను ఎమ్మెల్యే ప్రశంసించారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిఎస్పి నాగభూషణం పిడి కిరణ్ కుమార్ తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్ ఎస్ ఐ డేనియల్తోపాటు వివిధ మండలాల ఎస్ఐలు టిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ నాయకుడు గుజ్జ యుగంధర్ రావు మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య  టిఆర్ఎస్ నాయకులు పులుసు యాదగిరి గౌడ్   గుండ గాని రాములు గౌడ్ కటకం వెంకటేశ్వర్లు చెరుకు  పరమేశ్వర్  సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి గోపగాని రమేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ లతోపాటు వివిధ మండలాల జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.