కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా అన్నపర్తి జ్ఞాన సుందర్

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా అన్నపర్తి జ్ఞాన సుందర్

తుంగతుర్తి  ముద్ర : తుంగతుర్తి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అన్నపర్తి జ్ఞాన సుందర్ ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జ్ఞాన సుందర్ మాట్లాడుతూ తనను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాను ఎల్లవేళల కృషి చేస్తానని అన్నారు .తాను ఎన్ ఎస్ యు ఐ నుండి విద్యార్థి నాయకునిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానని నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ లోనే ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని అన్నారు .కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను గుర్తించి పార్టీ పదవి ఇచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐకమత్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిని అన్నపర్తి జ్ఞాన సుందర్ మర్యాద పూర్వకంగా కలిశారు.