వేసవిలో ఉచిత చదరంగం శిక్షణ తరగతులను సద్విని చేసుకోవాలి

వేసవిలో ఉచిత చదరంగం శిక్షణ తరగతులను సద్విని చేసుకోవాలి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట :వేసవి సెలవులలో ఉచిత చదరంగం శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని తమ మేదస్సులను పెంపొందించుకోవాలని సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ అన్నారు. ఈ నెల 4 నుండి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు  45వ వార్డులోని గండూరి జానకమ్మ రామస్వామి ఫ్రీ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ లో చదరంగంలో అనుభవద్యులైన ట్రైనర్ ల చే ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ వేసవి సెలవుల్లో చిన్నారులు టీవీలకు సెల్ ఫోన్ లకు బానిస కాకుండా ఈ చదరంగం శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మంత్రి జగదీష్ రెడ్డి స్ఫూర్తితో వారికి చిన్నారులపై ఉన్న మక్కువతో ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన చిన్నారులను  జిల్లా,రాష్ట్ర స్థాయి పోటీలకు సిఫార్స్ చేయబడునని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.