ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ల నందరిని ఫుల్ టైం స్వీపర్లుగా గుర్తించాలి - తల్లమల్లహసేన్

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ల నందరిని ఫుల్ టైం స్వీపర్లుగా గుర్తించాలి - తల్లమల్లహసేన్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాలల్లో గత కొన్ని సంవత్సరాలుగా స్వీపర్లుగా పనిచేస్తున్న సిబ్బందిని ఫుల్ టైం స్పీకర్లుగా గుర్తించి వారికి 27 వేల రూపాయలు నెల జీతం ఇవ్వాలని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు న్యాయవాది తల్లమల్ల హసేన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినారు  
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జమ్మిగడ్డ  జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర గత కొన్ని రోజులుగా తమ డిమాండ్లను నెరవేర్చాలని రిలే నిరాహార దీక్షలు చేయుచున్న ప్రభుత్వ పాఠశాలల  స్వీపర్ల సంఘం శిబిరాన్ని శుక్రవారం  అయన సందర్శించి వారికి మద్దతు తెలిపి సంఘీభావం తెలిపినారు.

ఈ సందర్భంగా శిబిరాన్ని ఉద్దేశించి హసేన్ మాట్లాడుతూ ప్రతినెల 27 వేల రూపాయలు జిల్లా ఇవ్వాలి అని కోరినారు . స్వీపర్ల నందరిని ఫుల్ టైం స్పీకర్లుగా సంవత్సరాలు నిండిన వారికిజీవో ఎంఎస్ 45 ప్రకారం 15 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలనీ,నెలకు 10500 పెన్షన్ ఇవ్వాలి స్వీపర్లను భేశరత్తుగా రెగ్యులరైజ్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును అమలు చేయాలనీ ,అన్ని పాఠశాలలో వెంటనే స్వీపర్ల నియామకం చేపట్టాలనీ సర్వీసులో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. సంఘీభావం తెలిపిన వారిలో మాల మహానాడు న్యాయవాదుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఏడిండ్ల అశోక్, మాల మహానాడు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల నరసయ్య పాల్గొన్నారు.