మౌనస్థితి ...! వైయస్సార్ టీ పీ ఏమిటి పరిస్థితి...!

మౌనస్థితి ...! వైయస్సార్ టీ పీ ఏమిటి పరిస్థితి...!
  • గమ్యం మారిందా లక్ష్యం మరిచారా
  • ప్రజల తరఫున కొట్లాడేది లేదు
  • పార్టీ కార్యక్రమాలు అంతకన్నా లేవు
  • అధినాయకత్వం నుంచి పిలుపు ఎంతకైనా రాదు
  • అడపాదడపా షర్మిల ప్రెస్ మీట్ లకే పరిమితం
  • జిల్లాలో క్యాడర్ ఎటూ తేల్చుకోలేక సతమతం
  • వైయస్సార్ టీ పి లో ఉందామా ఇతర పార్టీలోకి వెళ్దామా సందిగ్ధంలో పార్టీ క్యాడర్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టిపి) మౌనస్థితిలో ఉండడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ క్యాడర్ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంది పార్టీ ప్రారంభ రోజుల్లో పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రతో ఒక ఊపు వచ్చిన పార్టీ ప్రస్తుతం ప్రజల తరఫున పోరాటాలు లేక పార్టీ కార్యక్రమాలు అంతకన్నా లేక క్యాడర్ పార్టీలో ఉండాలా ఇతర పార్టీలకు వెళ్లాలా అన్నది తేల్చుకోలేక ఒక రకమైన అయోమయం గందరగోల పరిస్థితిలో ఉన్నదని ఆ పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్ టి పి విలీనం అవుతుందన్న వార్తలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్న నేపథ్యంలో నాయకుల పార్టీ అభిమానుల మద్దతుదారుల వైఖరి ఎలాగా ఉందో అన్న విచిత్రకరమైన పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు ఉన్నాయని రాజకీయ  పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • అధిష్టానం ఆజ్ఞ కోసం ఎదురుచూపులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు మద్దతుదారులు తెలంగాణలో పార్టీ పెట్టిన రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల వెన్నంటే ఉంటామని కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరుగా సాగాయి దీనికి తోడు పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేపట్టడంతో ఆ పార్టీ శ్రేణులు ఒక దశలో మంచి ఊపు మీద ఉన్నాయి. అయితే గత కొద్ది కాలంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన తదుపరి జాతీయ స్థాయి నాయకులతో కర్ణాటక కాంగ్రెస్ ఉపముఖ్యమంత్రి  శివకుమార్ తో షర్మిల బేటి కావడం చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్ టిపి విలీనం కానున్నదని వార్తలు  గుప్పుమనాయి. దీంతో గత కొంతకాలంగా పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ప్రజల తరఫున ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలి నిత్యం ప్రజలలో ఎలా ఉండాలి అన్న విషయాల్లో పార్టీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పార్టీ కేడర్  ఒక రకమైన మౌనముద్ర దాల్చారని చెప్పవచ్చు ఎక్కడ ఏ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో వైయస్సార్ టి పి పరిస్థితి ఏంటనే విషయాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు

  • పార్టీలోనే ఉండాలా ఇతర పార్టీలోకి వెళ్లాలా

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు వేగం పెంచి వాతావరణాన్ని వేడెక్కించగా వైయస్సార్ టీ పి మాత్రం చప్పగా చల్లారినట్టుగా ఉందని రాజకీయ వర్గాల బోగట్ట రాష్ట్రంలోని టీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపిలు ఇతర పార్టీలలోని నాయకులకు క్యాడర్కు గా లం వేసి తమ తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తుండగా తమ పార్టీ ఎందుకో ఉలుకు పలుకు లేకుండా కదలక మెదలక ఉందని వైయస్సార్ టిపి కార్యకర్తలే వాపోవడం గమనార్హం. ఇతర పార్టీలకు ఆకర్షితులై ఈ పార్టీని వీడి పోవాలా, లేదంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుందా ఉండదా కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీ వెళ్లిన అవుతుందా అన్న సవాలక్ష ప్రశ్నలు వైయస్సార్ టిడిపి క్యాడర్ మెదళ్లను
తొ లుస్తున్నాయి.

  • టి కెట్లపై ఆశలు గల్లంతు
  • గమ్యం మారి లక్ష్యం మరచి ఎటు వెళ్తున్నామో తెలియని స్థితిలో కేడర్

పార్టీ ఏర్పాటు చేసిన ఆరంభంలో ఆయా నియోజకవర్గాల నుంచి తాము పార్టీ తరపున తప్పక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆశించిన నాయకులు ఇప్పుడు బంగపడ్డారని చెప్పవచ్చు. పార్టీని మరింత బలోపేతం చేసి కేడర్ను పెంచి ఆయా నియోజకవర్గాల్లో గట్టి పునాదులు ఏర్పరిచి పార్టీ తరపున కాండిడేట్లను అసెంబ్లీ ఎన్నికల్లో నిలిపి విజయం కోసం కృషి చేస్తామన్న ఆశ ఆశయంతో మొదలైన తమ పార్టీ గమ్యాన్ని మార్చుకొని లక్ష్యాలను విస్మరించి ఏ దిశకు సాగుతుందో అంచనా వేయలేని అయోమయ స్థితిలో  ఉన్నామని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు సమయం చాలా తక్కువ ఉన్నందున నిత్యం ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కొట్లాడి పోరాటాలు చేసి ప్రజల మన్ననలు పొందాల్సిన పార్టీ క్యాడర్ అధిష్టానం అండదండలు లేక ఆజ్ఞ అందక పిలుపుకు కొరవడి ఒంటరిగా మారి ఏ కార్యక్రమం చేపట్టాలో ఏ కార్యక్రమం చేయకూడదు అన్న మీ మనసులో ఉమ్మడి నల్లగొండ జిల్లా వైయస్సార్ టిపి క్యాడర్ అనిశ్చిత పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుందని ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వైయస్ అభిమానులు మద్దతుదారులు కూడా తమ దారి తాము చూసుకోక తప్పదనే సంకేతాలు పార్టీ నియోజకవర్గ నాయకులకు అధిష్టానానికి పంపారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీలో పార్టీ విలీనం అయితే ఇన్నాళ్లు పార్టీ తరఫున పోటీలో ఉంటామని ఆశతో ఉన్న నియోజకవర్గ నాయకుల ఆశలు అడియాసలు గాక తప్పదు. పార్టీ అధినేత నుంచి త్వరలో సంకేతాలు వస్తాయని ఆ పార్టీ క్యాడర్ నమ్మకంగా ఆశతో ఎదురుచూస్తున్నారు.

  • రాహుల్ గాంధీ నిర్ణయం ఫైనల్ కానుందా

కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్ టిపి కలుస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి శివకుమార్ను పార్టీ నాయకురాలు షర్మిల కలవడం అక్కడ ఉన్న విషయాలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ దాకా వెళ్లడం మిగతా పరిస్థితులన్నీ తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపడం తదితర విషయాలని చెక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చే సమాచారంతోనే తమ పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలు ఉంటాయని వైయస్సార్ టిపి ప్రముఖ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అప్పటిదాకా పార్టీ లీడర్ క్యాడర్ను కాపాడుకోవడానికి నిత్యం ప్రజల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని మరికొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా మరికొంత కాలం గడిస్తే గాని వైయస్సార్ టిపి  భవితవ్యం పై కమ్ముకున్న నీలి నీడలు  పటా పంచలై ఒక స్పష్టత రానుంది అప్పటివరకు పార్టీ నాయకులకు క్యాడర్కు ఎదురుచూపులు తప్పవు కదా మరి...