కేసీఆర్ కుటుంబo కన్ను కొండగట్టు భూములపై పడింది

కేసీఆర్ కుటుంబo కన్ను కొండగట్టు భూములపై పడింది

 ముద్ర, మల్యాల: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధనార్జనయే లక్ష్యంగా గ్రానైట్, ఇసుక వ్యాపారం ప్రారంభించిన కేసీఆర్ కుటుంబం కన్ను ఇప్పుడు కొండగట్టు ప్రాంతంలోని అటవీ, ఆలయ భూములపై పడిందని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గాజుల మల్లేశం విమర్శించారు. కొండగట్టు ప్రాంతంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై ఆదివారం ఆయన మాట్లాడుతూ పచ్చని అడవిలో మొక్కలు నాటడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొండగట్టు పరిసర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సిద్దపడిందని, అందులో భాగంగానే సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమని విమర్శించారు.