గ్రామగ్రామాన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు...

గ్రామగ్రామాన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు...

ముద్ర, మల్యాల: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను మంగళవారం మల్యాల మండలంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, మిగిలిన అన్ని గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్విట్స్ పంపిణీ చేశారు.  నియోజకవర్గ కేంద్రం గంగాధరలో నిర్వహించే పార్టీ ప్లీనరీ సమావేశంకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షులు మిట్టపల్లి సుదర్శన్, జడ్పీటీసీ రామ్మోహన్ రావు, సింగిల్ విండో అధ్యక్షులు ముత్యాల రాంలింగారెడ్డి, సాగర్రావ్, మధుసూదన్ రావు, బద్దం తిరుపతి రెడ్డి, ఎడిపల్లి సుగుణఅశోక్, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, ఆగంతపు వంశీధర్, తదితరులు పాల్గొన్నారు.