సమస్త దేవతలకు నిలయం గోమాత-శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య కౌశిక

సమస్త దేవతలకు నిలయం గోమాత-శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య కౌశిక

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సమస్త దేవతలకు నిలయమైన గోవును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని వేద పండితులు ప్రముఖ జ్యోతి, వాస్తు శాస్త్ర పండితులు  శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య కౌశిక అన్నారు. జగిత్యాల పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో బాగంగా శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత శ్రీమదనగోపాలస్వామి పంచాహ్నిక ధ్వజారోహణ  తిరుకల్యాణం బ్రహ్మోత్సవాలు నాలుగోవ రోజు నిత్యహోమం, నరసింహస్వామి జయంతి, నవకలశ స్నాపానం, చందనోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు.

ఈసందర్భంగా. వేద పండితులు మాట్లాడుతూ గోమాతను కొలిస్తే సకల దేవతలను పూజించినట్టేన్నారు. ఇంట్లో పిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించి భావి తరాలకు అందించే బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.  ఏకాగ్రత ద్వారా జీవిత ప్రశాంతత లభిస్తుందని, ఏకాగ్రత ఉండడానికి చెడును వీడనాడి మంచి మార్గంలో నడవాలన్నారు. ఈకార్యక్రమంలో వేద పండితులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.