భక్తిశ్రద్ధల మధ్య నరసింహ స్వామి జయంతి

భక్తిశ్రద్ధల మధ్య నరసింహ స్వామి జయంతి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి గ్రూప్ సంస్థల్లో ఒకటైన శ్రీ యోగ నరసింహస్వామి ఆలయంలో గురువారం నరసింహ స్వామి జయంతి వేడుకలను భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాత:కాలం మంగళ వాయిద్యాల మధ్య బిందసేవ పేరిట ఆలయం చుట్టూ ప్రకార ప్రదక్షిణ నిర్వహించి గర్భాలయంలో కొలువుతీరిన పరివార దేవతలతో పాటుగా మూలమూర్తి అయిన యోగ నరసింహ స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా పంచామృతాభిషేకాలు గంధభిషేకాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హరివాయు స్తుతి. నరసింహ కరావలంబ స్తోత్రాలు. వల్లే వేశారు. అదే విధంగా ఆలయంలో సుదర్శన మూలమంత్ర హోమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం మహా నివేదనలు జరిపి, ప్రదోషకాలంలో స్వామివారి ముఖమండపం లో దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలకు కళ్యాణోత్సవాన్ని నేత్రోత్సవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పురంధర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నిత్యానందం, ఆలయ సిబ్బంది, స్థానిక భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.