మహిళలకు చిన్నారుల కోసం ప్రత్యేకంగా చేస్తున్న స్మృతి వనం పార్క్ ఓపెన్ జిమ్ పరికరాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

మహిళలకు చిన్నారుల కోసం ప్రత్యేకంగా చేస్తున్న స్మృతి వనం పార్క్ ఓపెన్ జిమ్ పరికరాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

కొత్త హంగులతో స్మృతి వనం పార్క్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈ రోజు గద్వాల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులోని రాజీవ్ మార్గ్ స్మృతి వనం పార్కును గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, సహాయ సహకారాలతో కొత్త హంగులతో మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్, స్మృతివనం పార్కును ముస్తాబు చేయిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా చేస్తున్న స్మృతి వనం పార్క్, ఓపెన్ జిమ్ పరికరాలను సోమవారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా

చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ.

స్మృతి వనంలో ప్రత్యేకంగా మహిళల కోసం ఓపెన్ జిమ్, చిన్నారులు కోసం ఆట సామాగ్రి లను అన్ని హంగులతో నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పార్కులో పెరుగుతున్న పిచ్చి మొక్కలను ఎప్పటికి అప్పుడు తొలగించాలన్నారు.  అదేవిదంగా ప్రతి రోజు పార్కును పరిశుభ్రంగా ఉంచాలని జవాన్లకు, పారిశుధ్య కార్మికులకు ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. పార్కుకు వచ్చే సందర్శకులు. ఉదయం. సాయకాలం. వాకింగ్ కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలను కల్పించాలన్నారు. ఈ నెల చివరిలోనే పార్క్ ప్రారంభోత్సవానికి అని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకీ తీసుకురావాలని అధికారులకు తెలుపడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ పార్కును సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ కేశవ్, పట్టణ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ టీ.శ్రీను, నరహరి శ్రీనివాసులు, శ్రీమన్నారాయణ, బి ఆర్ యస్ పార్టీ నాయకులు బొట్టు సుధాకర్ రిజ్వాన్ మున్సిపల్ అధికారులు డి.ఇ ఏ.ఇ. తదితరులు పాల్గొన్నారు.