ఇఫ్తార్ విందు కు హాజరైన గద్వాల్ ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందు కు హాజరైన గద్వాల్ ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి - గద్వాల్ ఎమ్మెల్యే ఈ రోజు గద్వాల్ జిల్లా కేంద్రంలోని  ఒంటెలపేట మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్. ఆధ్వర్వంలో  రంజాన్ మాసం సందర్బంగా గుల్దార్ మసీద్ లో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, హాజరయ్యారు.  నమాజ్ లో ముఖ్య అతిథులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం ఇఫ్తార్ విందు కార్యక్రమం ప్రారంభించిచారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పెద్దలకు ముస్లిం సోదరులకు రంజాన్  మాసపు శుభాకాంక్షలు బిఆర్ఎస్ పార్టీ ఈ పదేళ్ల కాలంలో 12000  కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు చేసింది. ఇఫ్తార్ పార్టీలు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు, కులాలకు సీఎం కెసిఆర్, కేటీఆర్, సమాన ప్రోత్సహం అందరికి ఎల్లప్పుడు ఉంటుందని గద్వాల్ ఎమ్మెల్యే. పేర్కొన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో కఠినంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులు అందరూ ఆనందంగా ఉండాలని అందుకు అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడుని కోరుకున్నట్లు తెలిపారు.

ముస్లిం సోదర సోదరీమణులు  నేతలకు మత పెద్దలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు,  కౌన్సిలర్స్ నరహరి శ్రీనివాసులు, నాగరాజు, శీను, కో ఆప్షన్ నెంబర్ అబ్దుల్ మోబిన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఖలీల్, జనార్దన్ రెడ్డి, రామకృష్ణ శెట్టి, షుకర్, మోబిన్ అన్వర్, భగీరథ వంశీ, కురుమన్న, పరుశురాముడు, ఫయాజ్, గాంధీ, జగదీష్, కృష్ణ, వీరేష్, ముస్లిం సోదరులు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.