బిజెపి కో హటావ్ - దేశ్ కో బచావ్

బిజెపి కో హటావ్ - దేశ్ కో బచావ్

ఇంటింటికి సి.పి.ఐ ప్రజా పోరు యాత్రను ప్రారంభించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యం బాల్ నరసింహ.

మత తత్వ విధానాలు దేశానికీ ప్రమాదం

పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు బిజెపి కో హఠావో దేశ్ కో బచావ్ అనే నినాదంతో ఇంటింటికి సి.పి.ఐ ప్రజాపోరు యాత్ర జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ మండలంలో ప్రారంభించడం జరిగింది. ఈకార్యక్రమాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యం బాల్ నరసింహ, ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. నరేంద్ర మోడీ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అధిక ధరలను పన్నులను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు విమర్శించారు.దేశ ప్రజల సంపదను అధాని లాంటి బడా పెట్టుబడిదారులకు అమ్మెస్తు మోసం చేస్తున్నారు.

పైగా మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. భారత పారిశ్రామిక వ్యవస్థను మరియు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాడని అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం కుట్రలు పన్నుతున్నాడని ఆయన విమర్శించారు ఈ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మాటతప్పడంతో కొద్దిమంది పెట్టుబడుదారుల కొరకే బిజెపి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ధరలను కట్టడి చేయడంలో బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన పేర్కొన్నారు .

అందుకే యావత్తు భారత దేశ వ్వాప్తంగా బిజెపి కో హఠావో దేశ్ కో బచావో అనే నినాదంతో ఇంటింటికి సి.పి.ఐ.పేరుతో ప్రజలను చైతన్య పరుస్తూ బిజేపి నీ మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకొని భారత దేశాన్ని మతతత్వ శక్తుల నుండి కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు అలంపూర్ పట్టణంలో ప్రారంభమైన జాత ర్యాలంపాడు కింది సింగారం పై సింగారం కాసాపురం తదితర గ్రామాలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు, నియోజిక వర్గ ఇంఛార్జి,మండల కార్యదర్శి పెద్దబాబు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు చెన్నయ్య, రామాంజనేయులు, వెంకట్రామూడు, అశన్న, డి యచ్ పి యస్. జిల్లా నాయకులు  మహేష్ , నడిపి, రాజు,బాబు,ఎ ఐ యస్ యఫ్. నాయకులు ప్రవీణ్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.