55 లక్షల వ్యవంతో పలుఅభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

55 లక్షల వ్యవంతో పలుఅభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ఈ రోజు గద్వాల నియోజకవర్గం గట్టు మండలం పరిధిలోని తప్పెట్ల మరుసు  గ్రామంలో పలు అభివృద్ధి  భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. హాజరయ్యారు. గ్రామంలో జెడ్ పి యచ్ ఎస్ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగినది. అదేవిధంగా గ్రామంలో బీసీ ఎస్సీ, మల్టీపర్పస్  కమ్యూనిటీ హాల్ (ఫంక్షన్ హాల్) 41 లక్షల వ్యయంతో ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. 5 లక్షల వ్యవంతో  సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే. భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగినది. ఎమ్మెల్యే కి గ్రామ సర్పంచ్ శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే కాసేపు 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు ఏ విధంగా చదువుకుంటున్నారు. మంచిగా చదువుకొని ఈ రెండు, మూడు నెలలు టీవీలకు మొబైల్ లకు దూరంగా ఉండాలి చదువుపై శ్రద్ధ పెట్టాలి మీ గ్రామానికి మండలానికి గద్వాల నియోజకవర్గం రాష్ట్రంలో మంచి గుర్తింపు తీసుకురావాలి. అత్యున్నత మార్కులు సాధించాలని సూచించారు. అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ

ఒకే రోజు మీ గ్రామంలో 55 లక్షలు పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటు తర్వాతనే  సీఎం కేసీఆర్. నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాలపై కేసీఆర్. ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టాక్టర్, ట్యాంకర్, అదేవిధంగా గ్రామము ప్రజలందరూ అరణ్యంగా ఉండాలని ఎప్పుడూ పరిశుభ్రంగా గ్రామాల నుంచి పోవడానికి మల్టీపర్పస్ వర్కర్స్, డంపింగ్ యార్డ్ లో, గ్రామంలో ప్రజలు కాసేపు సాయంకాలం  సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగింది. వైకుంఠధామాలు అదేవిధంగా గ్రామాలలో సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు గ్రామపంచాయతీ భవనలు ఏర్పాటు చేయడం గ్రామాలలో పట్టణాల తీర్చిదిద్దడం జరుగుతుందని కేసీఆర్. నాయకత్వంలో సాధ్యమవుతుందని తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గద్వాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పేద ప్రజలు వివాహ శుభకార్యాలు జరుపుకోవాలని మల్టీపర్పస్ కమిటీ హాల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఫంక్షన్ హాల్ లో త్వరలో  అన్ని గ్రామాలలో అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో రావడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు వేషగాళ్లు రకరకాల వేషాలు వేసుకొని ప్రశాంతంగా గ్రామాలలో అలజడి సృష్టించడానికి ఇబ్బందులను పెట్టడానికి  రావడం జరుగుతుంది. కాబట్టి  వాటిని తిప్పికొట్టే విధంగా కేసీఆర్. నాయకత్వంలోనే మేమంతా సంతోషంగా ఉన్నామని కెసిఆర్. మా నాయకుడని వారికి సమాధానం చెప్పాలి సూచించారు.

మరొక్కసారి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని  బంగారు తెలంగాణ నిర్మాణం కేసీఆర్ తో సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ విజయ్, మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, మండలం పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, గ్రామ సర్పంచ్ కృష్ణయ్య గౌడ్, ఎంపిటీసి పారిజాతం, మండలం కో ఆప్షన్ నెంబర్  బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గద్వాల తిమ్మప్ప, రాము కురుమన్న,  తిమ్మప్ప గౌడ్, మధుసూదన్ రెడ్డి, జయన్న , గోవిందు, తిమ్మప్ప,  కార్యకర్తలు, యూత్ సభ్యులు,  తదితరులు పాల్గొన్నారు.