బిజెపి కి షాక్

బిజెపి కి షాక్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: లింగాపురం సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీలో చేరిక. గట్టు మండలం పరిధిలోని లింగాపురం గ్రామానికి చెందిన బిజెపి పార్టీ సర్పంచ్ సూర్య గౌడ్, బిజెపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సమక్షంలో గట్టు మండల ఆత్మీయ సమావేశంలో సూర్య గౌడ్, కి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ బాసు శ్యామల, మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, పాక్స్ ఛైర్మన్ వెంకటేష్, మండలం సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.