విద్యార్థినులనే స్వీపర్లుగా మార్చారు

విద్యార్థినులనే స్వీపర్లుగా మార్చారు
  • చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రుల డిమాండ్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులనే స్వీపర్లుగా మార్చి పరిసరాలను శుభ్రం చేయిస్తున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. నెల నెలా వేలకు వేలు జీతాలు తీసుకునే వసతిగృహం అధికారులు విద్యార్థినులను స్వీపర్లుగా మార్చి పనులు చేయించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ ఇళ్ల దగ్గర పనులు చేస్తూ చదువును నిర్లక్ష్యం చేస్తారనే ఉద్దేశ్యంతో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిలో చదువు తప్పా మరే ధ్యాస ఉండొద్దు అని భావించి వసతి గృహంలో చేర్పిస్తే ఇక్కడ ఇలాంటి పనులు చేయించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇకనైనా అధికారులు స్పందించి విద్యార్థినులు, విద్యార్థులతో పనులు చేయించే వసతి గృహం అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.