రెండో రోజు 61 వీధి కుక్కలను అటవీ ప్రాంతాలకు తరలింపు

రెండో రోజు 61 వీధి కుక్కలను అటవీ ప్రాంతాలకు తరలింపు

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 24, 25, 36వ వార్డులు పలు ప్రాంతాలలో కుక్కల బెడద ఎక్కువగా ఉండటంతో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కలు రోడ్ల వెంట వెళ్లే వారిపై, చిన్నారులపై దాడులు చేస్తుండటంతో ఈ విషయాన్ని మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్, దృష్టికి తీసుకురాగ వెంటనే స్పందించి కుక్కలను తరలించడానికి రాజమండ్రి నుండి జంతు సంరక్షణ వాలంటీర్ల ద్వార పట్టణంలో వున్న వీధి కుక్కలను అటవీ ప్రాంతాలకు తరలించారు.

ఈ సందర్బంగా ప్రజలు, చిన్నారులు, వాహనదారులు తిరిగే ప్రదేశాలలో వీధి కుక్కలు మీదికొస్తున్నాయి. వాహన దారులకు అడ్డురావడం వాటిని తప్పించుబోయే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక మీదట ఇలా జరగకుండా పట్టణ ప్రజలకు ఇబ్బందులు సృష్టించకుండా ఉండాలని రెండో రోజు మొత్తం 61 వీధి కుక్కలను జంతు సంరక్షణ వాలంటీర్ ద్వార అటవీ ప్రాంటతాలకు తరలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, జంతు సంరక్షణ వాలంటీరులు తదితరులు పాల్గొన్నారు.