నడిగడ్డ మార్పు కోసమే ఆత్మగౌరవ పాదయాత్ర - గొంగళ్ల రంజిత్ కుమార్..

నడిగడ్డ మార్పు కోసమే ఆత్మగౌరవ పాదయాత్ర - గొంగళ్ల రంజిత్ కుమార్..
  • 5వ రోజు కె.టి.దొడ్డి,ధరూర్ మండలాల మీదుగా కొనసాగిన నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర..

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: రంజిత్ కుమార్ కి పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికిన నెట్టెంపాడు, నాగర్ దొడ్డి గ్రామస్తులు..జోగులాంబ గద్వాల జిల్లా: కె.టి.దొడ్డి ధరూర్ మండలాల మీదుగా నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర 5వ రోజు కె.టి.దొడ్డి మండలంలోని సోమవారం ఉదయం వెంకటాపురం,ఈర్లబండ,పాతపాలెం గ్రామాల మీదుగా సాగిన ఆత్మగౌరవ పాదయాత్ర మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత ధరూర్ మండలంలోని నీలహళ్లి,నెట్టెంపాడు,నాగర్ దొడ్డి,ధ్యాగదొడ్డి, ఉప్పేరు గ్రామం వరకు కొనసాగింది.
అలాగే నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా కె.టి.దొడ్డి మండలం ఈర్లబండ, పాతపాలెం గ్రామానికి విచ్చేసిన సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ కి గ్రామస్తులు, మహిళామణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అలాగే ధరూర్ మండలంలోని నీలహళ్లి, నెట్టెంపాడు, నాగర్ దొడ్డి, గ్రామానికి నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో గొంగళ్ల రంజిత్ కుమార్, విచ్చేసిన సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.

నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర నిర్వహించడానికి ముఖ్య కారణం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాలు బహుజన ప్రజలందరినీ గ్రామ గ్రామాన  ఐక్యమత్యం చేయడానికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నడిగడ్డ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకగా ముందుండి పోరాటం చేస్తూ నడిగడ్డ ప్రాంతంలో సరైన విద్యా, వైద్యం, సంక్షేమం అభివృద్ధి లేక వెనకబాటుకు గురైన ప్రాంతమని
ఈ నడిగడ్డ ప్రాంతంలో విద్య,వైద్యం సంక్షేమ అభివృద్ధికై మా పోరాటం నిర్వహిస్తామని రాబోయే రోజుల్లో బహుజన రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా నడిగడ్డ మార్పు కోసమే బహుజన నాయకత్వాన్ని నిలబెట్టడం కోసం నడిగడ్డ ప్రజలు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.మీ 70 ఏళ్ల కుటుంబ పాలనలో మాకు విద్య,వైద్యం అందడానికి, మా గ్రామాలకు రోడ్లు వేయడానికి ఇన్నేళ్లు కావాలా? అని ప్రశ్నించారు .అధికారాన్ని అడ్డం పెట్టుకొని గ్రామాలలో గొడవలు సృష్టిస్తూ ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

పాతపాలెంలో బోయ పావని అనే మహిళ భర్త చనిపోయి నాలుగు సంవత్సరాలుగా కావస్తున్నా ఇంకా వితంతు పించను అందడం లేదని అవేదన వ్యక్తం చేసింది. నీలహాల్లి లో అర్హులైన వారికి  పెన్షన్స్ అందడం లేదని రంజిత్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.నీలహల్లి లో పోలం లో రైతు కూలీ లతొ ముచ్చటిస్తూ వారితో కలిసి వారు తెచ్చుకున్న సద్ది ని ఆరగించారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, కార్యదర్శి లవన్న, రంగస్వామి, కె.టి. దొడ్డి మండల నాయకులు అంజి భీమన్ గౌడ్, ఏసు, ఎల్లేష్, ధరూరు మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు, ఉపాధ్యక్షులు మునెప్ప, ఆంజనేయులు, కార్యదర్శి రాము మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, ప్రేమ్ రాజ్, తిమ్మప్ప, శివన్న, ఎల్లప్ప, మహలింగప్ప తదితరులు పాల్గొన్నారు.