మైనర్లు వాహనాలు నడిపితే. తల్లిదండ్రులపై కేసులు నమోదు: ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్

మైనర్లు వాహనాలు నడిపితే. తల్లిదండ్రులపై కేసులు నమోదు: ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :మైనర్లను హెచ్చరిస్తున్న ట్రాఫిక్ ఎస్సై 

గద్వాలపట్టణం:- మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదుచేస్తామని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్, వాహనాదారులకు తెలియజేశారు. బుధవారం పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్  పరిధిలో లో ట్రాఫిక్ ఎస్ఐ  తన సిబ్బందితో కలిసి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహించారు. సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్, మాట్లాడుతూ. ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం వలనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు.తల్లిదండ్రులు మైనర్లకు  వాహనాలు ఇవ్వవద్దు అని గద్వాల ట్రాఫిక్ ఎస్సై ప్రతి రోజు ఎన్నో సందర్భాల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహణ కార్యక్రమాలు చేస్తున్న తీరు మారని తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.ఆ తర్వాత కూడా మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మైనర్లు సైతం స్కూటీలు, బైకు వాహనాలు నడుతున్నారని, సిసి కెమేరాల్లో పరిశీలించామని ఇది ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సిసి కమేరాల్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, ఇకపై వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం కూడా నేరమేనని, ఇటువంటి వారి వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎదురుగా వచ్చే వారి తప్పు లేకపోయినా వచ్చీరాని డ్రైవింగ్ వలన ఇద్దరికీ గాయాలవుతున్నాయని తెలిపారు. పట్టణ పరిధిలోను వాహనాల డ్రైవింగ్ పై ప్రత్యేక నిఘా పెడతామని, తల్లిదండ్రులు లైసెన్స్ లేనివారికి తమ వాహనాలు ఇవ్వవద్దని, ఇస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.  చిన్నపిల్లలు వావనాలు నడపడం వలన కొందరు చెడు వ్యసనాలకు సైతం అలవాటు పడుతున్నారని,  కొందరు యువకులు బైక్ పై రేసింగ్ చేస్తున్నారని అటువంటి వారిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని, కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ సిబంది పాల్గొన్నారు.