ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా  సత్వరమే పరిష్కరించాలి

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా  సత్వరమే పరిష్కరించాలి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు, తాసిల్దారులకు ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు  ఏర్పాటు చేసిన  ప్రజా వాణి  లో జిల్లాలో వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రజల ద్వారా 146  ఫిర్యాదులను  స్వీకరించారు. వీటిలో  ఆసరా పెన్షన్ కు సంబంధించి 8, భూ సమస్యలపై 85, రెండు పడకల గదులకు సంబంధించి  15 దరఖాస్తులు, ఇతర సమస్యల పై 38 వచ్చాయని, అట్టి ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అందజేసి సమస్యలను పరిశీలించి పరిష్కారించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు సంబంధిత మండల అధికారులతో చర్చించి వారి పరిధిలోని దరఖాస్తులు పెండింగ్ ఉంచకుండా  పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భూ సమస్యలపై వచ్చిన దరకాస్తులను పరిశీలించి  మీ సేవలో సక్సేషన్ కింద దరఖాస్తు చేసుకోవాలని దరకస్తుదారుడికి వివరించారు.  పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన  భూ సమస్యలపై పిర్యాదులను పరిశీలించి ఆయా మండలాల తహశిల్దార్ లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.