కరాటే వల్ల విద్యార్థులు మానసికంగా ఎదగవచ్చు

కరాటే వల్ల విద్యార్థులు మానసికంగా ఎదగవచ్చు

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : కరాటే మార్శల్ ఆర్ట్ నేర్చుకోవడం వలన దేహదారుడ్యంతో పాటు మానసికంగా ఎదగవచ్చని డ్రాగన్ షోటోకాన్ డూ ఇండియా క్లబ్ ఫౌండర్ చీప్ సాలంబీన్ ఉమర్ అన్నారు. డ్రాగన్ కరాటే షోటోకాన్ ఆద్వర్యంలో ఆదివారంనాడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జెఆర్ ఫంక్షన్ హల్లో విధ్యార్థులకు కరాటే పోటీలను నిర్వహీంచారు.ఈపోటీలకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో కరాటే శిక్షణ శిభరం నుండి గద్వాలకు చెందిన విధ్యార్థులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో జరిగే అండర్ డూజో టోర్నమెంట్లో పాల్గొని పథకాలను సాధించారు.సాధించన వారు విశాల్( బంగారు పతకం) గ్రౌండ్ చాంపియన్ షిప్, సాధించారు అదేవిధంగా నరేష్ (బంగారు పథకం) సాధించారు.అలాగే మహెందర్ సిల్వర్ పథకం, కె.వరుణ్ సందేష్, జశ్వంత్, అభిరాం, హర్షవర్దన్, పండు, కార్థిక్, కె. చెన్న కేశవ్, మణితేజ, లు వివిధ పథకాలు సాధించారు. ఈకార్యక్రమంలో అభిలాష హెల్పింగ్ హ్యండ్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు డాక్టర్ సరోజమ్మ, మాజీ ఎంపీటీసి వెంకట్రాములు, చీప్ ఎగ్జామినర్ మాస్టర్ అమ్రేష్, డ్రాగన్ షోటోకాన్ కార్యదర్శి శేక్ అబ్దుల్ సలాం, మాస్టర్ సలీం, (టోర్నమెంట్ ఇంచార్జ్) ఎండీ అర్పత్, మౌనిక, శేఖర్, కె వెంకటేష్, పహీం, అఖిల, జయశ్రీ, మోసిన్, తదీతరులు పాల్గొన్నారు