చిన్నోనిపల్లి నిర్వాసితుల  సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  త్వరితగతిన  పరిష్కరిస్తామని  ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్

చిన్నోనిపల్లి నిర్వాసితుల  సమస్యలను  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  త్వరితగతిన  పరిష్కరిస్తామని  ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ఆర్&ఆర్ సెంటర్ లో మౌలిక వసతులు  కల్పించేందుకు ఎమ్మెల్యే  జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, సమీక్ష సమావేశంలో ఆర్డీఓ,   నీటి పారుదల శాఖ అధికారులు కలిసి చిన్నోనిపల్లి గ్రామ నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగినది.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ఆర్ అండ్ ఆర్ సెంటర్లో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను  ప్రత్యేక నిధుల ద్వారా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులు చిన్నోనిపల్లి గ్రామాన్ని వెంటనే ఖాళీ చేయడానికి సిద్ధం కావాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు పంచాయతీ భవనం, అంగన్వాడి భవనం, దేవాలయాల నిర్మాణానికి  కృషి చేస్తామని తెలిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ...
గత పాలకుల సమన్వయ లోపం ఎప్పుడో పూర్తి కావాల్సిన రిజర్వాయర్ నేటికీ అసంపూర్తిగా ఉండిపోయింది. ఆర్ అండ్ ఆర్ సెంటర్కు కావాల్సిన మౌలిక సదుపాయాలను అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. ఆర్ అండ్ అర్ సెంటర్ నిర్వాసితులకు  వర్తించే అన్ని సదుపాయాలను నిధులను కేటాయించి అన్ని విధాలుగా చిన్నోనిపల్లి.  గ్రామస్తులకు ప్రభుత్వం తరఫున ఆదుకుంటాము మరియు అండగా ఉంటామని భరోసాను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిపి విజయ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు దేవేందర్, గద్వాల తిమ్మప్ప, చిన్నోనిపల్లి గ్రామస్తులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.