గద్వాలలో సిపిఎస్ ఉద్యోగుల మహా ధర్నా

గద్వాలలో సిపిఎస్ ఉద్యోగుల మహా ధర్నా

పాత పెన్షన్ కై కదం తొక్కిన సీపీయస్ ఉద్యోగులు

మానవహారంతో మొదలైన భారీ ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: తెలంగాణ  రాష్ట్ర సిపిఎస్  ఉద్యోగుల సంఘం జోగులాంబ గద్వాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల గద్వాల నుండి  సీపీయస్ రద్దుకై పెన్షన్ కాన్స్టిట్యూషనల్ ర్యాలీ ప్రారంభమైంది. వైఎస్సార్ సర్కిల్ పాత బస్టాండ్ వద్ద నినాదాలతో మానవహారం నిర్వహించారు.నేడుఅంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 309 ప్రకారం సిపియస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ప్రక్రియ పునరుద్దరించాలినీ గద్వాలలో సిపిఎస్ ఉద్యోగులు కదం తొక్కారు. బాలికల ఉన్నత పాఠశాల నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ మానవహారం నిర్వహించి అంబేద్కర్ చౌక్ కొరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు. కానీ 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన (ఒపీస్ &సీపీస్) జరగడంతో ఉద్యోగుల సామాజిక భద్రత కోల్పోవడం జరిగింది. పెన్షన్ అనేది ఉద్యోగి దీర్ఘకాలం పనిచేసినందుకు ఇచ్చే ప్రతిఫలం కాదు. అందులో ఉద్యోగుల సామాజిక ఆర్థిక, భద్రత ప్రయోజనాలు దాగి ఉన్నాయని 1982లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం తీర్పును కూడా పట్టించుకోకుండా వృద్ధాప్య శాపంలా పరిణమించే మార్కెట్ ఆధారిత పెన్షన్ అమలు చేయడం ఉద్యోగుల ఉసురు తీయడమే. అంతేగాక అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణలో ఉద్యోగుల ఆర్థికత 309 ప్రకారం పాత పెన్షన్ ప్రక్రియ పునరుద్ధరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగరాజు, రాష్ట్ర సహా అధ్యక్షులు విష్ణు, జిల్లా కోశాధికారి రమేష్, జిల్లా గౌరధ్యక్షుడు బుచ్చన్న, జిల్లా క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ నరసింహ, జిల్లా సహాధ్యక్షులు నగేష్,ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్ రెడ్డి, లక్ష్మి నారాయణ, అంజి, పరుషరాం, ఏళ్లస్వామి, కొండాపురం ప్రతాప్, మహిళల సభ్యులు దానమ్మ, వెంకటలక్ష్మీ, సుజాత, అజుబ, సురేఖ, సుధరాణి, అనూష, శ్రీలత, గద్వాల్ మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి,టిఎన్జీవో నాగార్జున గౌడ్, బీజాపూర్ ఆనంద్, టెక్నికల్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట రాజారెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ నాగేష్, యుటిఎఫ్ గోపాల్, పిర్టియు తిమ్మరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి,తపస్ మహేందర్, హెల్త్ డిపార్ట్మెంట్ సీసీ వెంకటేష్,తిరుమల రెడ్డి,  ఎస్.జి.టి.ఓ సోమ సుందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ సెక్రటరీ జిల్లా అధ్యక్షులు ఖాజామీర్,పశు సంవర్దన శాఖ భూమయ్య,నాల్గవ తరగతి ఉద్యోగ సంఘం బషీర్ అహ్మద్, టిపిఆర్టీయు తిమ్మప్ప, బీసీటియు వెంకటేష్, ఎస్టీయు పి.లక్ష్మణ్, శంకర్ నాయక్, టిఎస్టీయు రమేష్, మల్లికార్జున్, జీటిఏ కృష్ణ, వివిధ సంఘ నాయకులు, సీపీయస్ సంఘం వివిధ మండలాల నాయకులు, ఓపిఎస్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో  ఇట్టి పెన్షన్ ర్యాలీ కి సంఘభావంగా వచ్చి విజయవంతం చేయడం జరిగింది.