మున్నూరు కాపు మహిళలు చైతన్యవంతులు కావాలి

మున్నూరు కాపు మహిళలు చైతన్యవంతులు కావాలి

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ 
జిల్లా సంఘం మహిళా అధ్యక్షురాలిగా చందం సబితా

ముద్ర ప్రతినిధి, మెదక్: మున్నూరు కాపు మహిళలు చైతన్య వంతులై సంఘటితంగా ముందుకు సాగితే తమ హక్కులను సాధించుకోవచ్చని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పిట్లంబేస్ సంఘ భవనంలో  జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  రాష్ట్రంలో మున్నూరు కాపు సంఘ పటిష్ట పరచడంలో భాగంగా  అనుబంధ సంఘాల నిర్మాణం చేపట్టామన్నారు. ఇందులో భాగంగా మహిళ రాష్ట్ర కన్వీనర్ బండి పద్మ పటేల్, వర్కింగ్ ప్రెసిడెంట్ రజిత పటేల్  ఆద్వర్యంలో అన్ని జిల్లాల్లో మహిళా కమిటీల ఏర్పాటు ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. విద్యావంతులు, ఉత్సాహ వంతులైన మహిళలు ముందుకు వచ్చి సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. ఈ కమిటీలు మున్నూరు కాపు మహిళల సంఘటితాని  కృషి చేయాలని సూచించారు. గ్రామ, మండల, మున్సిపల్ టౌన్ మహిళా కమిటీలు ఎర్పాటు చేసి మహిళ శక్తి నీ చాటాలన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఎర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సంఘ భవనాల , కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, స్కిల్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటుకు  కృషి చేస్తున్నామన్నారు. మన్నూరు కాపు విద్యార్థుల ఉన్నత చదువులకు, విదేశీ విద్యకు సాకారం అందిస్త మన్నారు.

మహిళా అధ్యక్షురాలిగా చందం సబితా
మున్నూరు కాపు సంఘం మెదక్ జిల్లా మహిళా నూతన అధ్యక్షురాలిగా చందం సబితా, ప్రధాన కార్యదర్శిగా నగరం నాగరాణి, ఉపాధ్యక్షులుగా కానుగు రాధిక, బీర స్రవంతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కామాటి మాధవి, మెదక్ టౌన్ అధ్యక్షురాలు కంతి జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా చిత్తారి రాజేశ్వరి, సహాయ కార్యదర్శిగా బట్టి విజయలక్ష్మి, కోశాధికారిగా ఆవారి మానవిని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. వారికి రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దేమె యాదగిరి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ తాడేం రంజిత కృష్ణ మూర్తి, రాష్ట్ర కన్వీనర్ బండి పద్మ, కార్యదర్శి వసం వెంకటేశ్వర్లు,  జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, జిల్లా జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షుడు తిమ్మన్న గారి శ్రీధర్, జిల్లా యువక మండలి కన్వీనర్ బోనగిరి చంద్రశేఖర్, కౌన్సిలర్లు బట్టి లలిత, ఆవారి శేఖర్,  కోఆర్డినేటర్ వీర్ కుమార్, పట్టణ గౌరవ అధ్యక్షులు పెండల నాగభూషణం, పట్టణ అధ్యక్షుడు కొంగటి గట్టేష్, ఉపాధ్యక్షులు కామాటి కృష్ణ, ఆయా సంఘాల అధ్యక్షులు కుల్ల నర్సింలు, కొంగటి మల్లేశం, హర్కార్ మహిపాల్, చింతల రాములు, నర్సింలు,  తిరుపతి, విజయ్, శివ, పూల మల్లేష్, రాము, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.