తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు

తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని శానికే ఆదర్శంగా తీర్చి దిద్దారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మినగర్ ఎస్ఆర్ గార్డెన్ లో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.ఎరువులకు, నీళ్లకు, కరెంట్ కు ఎన్ని కష్టాలు పడ్డాము గుర్తు చేసుకోవాలన్నారు. మెదక్ కు, మన పార్టీకి ముఖ్యమైన ఎన్నికలు. భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. భవిష్యత్ నిర్ణయించే ఎన్నిక ఇదని మంత్రి పేర్కొన్నారు. అందర్నీ కలుపుకొని పోవాలని సూచించారు. ఎమ్మెల్యే పద్మ ప్రజల్లో ఉండి, నియోజక అభివ్రుది కోసం కృషి చేశారన్నారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అన్నారు. మన ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్ళు ఉంటే ఇంకా బాగా అభివృద్ది చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్ నుండి బెంజ్ కారులో వచ్చి ఆత్మగౌరవం గురించి మాట్లాడటం నమ్ముతారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏమన్నడు రైతు బంధు బిచ్చం వేస్తున్నాం అన్నారడన్నారు. ప్రతి రైతుకూ 15 వేలని కుట్ర చేస్తున్నది కాంగ్రెస్. ఎన్ని ఎకరాలు ఉన్నా 15 వేలే ఇస్తారని ద్వజమేత్తారు.కెసిఆర్ ప్రతి ఎకరాకు 16 వేలు అంటే, కాంగ్రెస్ ప్రతి రైతుకు 15 వేలు అంటున్నది ప్రజలు ఆలోచించాలని కోరారు. 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నామని ఒప్పుకొని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్.నెత్తిల పాలు పోసిండన్నారు. ఛత్తీస్ ఘడ్ లో ఎకరాకు 13 క్వింటాళ్ల వడ్లు మాత్రమే కొంటారన్నారు. మిగతా కొనరని తెలిపారు. కానీ మన దగ్గర ప్రతి గింజ కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. మనది మంచి మేనిఫెస్టో ప్రజలందరికీ చేర్చాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్, రైతుకే డబ్బు ఇచ్చిన ఒకే ఒక్కడు కేసీఆర్ అన్నారు. 400 లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నామని, సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు 3 వేలు ఇవ్వబోతున్నామన్నారు. రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నామని, ఏటా 1300 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నారు. గురుకులాల్లో ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్నం. ఇకనుండి పెద్దలకు కూడా సన్నబియ్యం అందజేస్తామన్నారు. రైతు బీమా లాగానే, 5 లక్షల బీమా కోటి కుటుంబాలకు మందికి చెయ్యబోతున్నమని వివరించారు. 

బిఆర్ఎస్ గెలిచాక ఆసరా పింఛన్లు 5వేలు చేయబోతున్నాన్నారు. ఆసైండ్ ల్యాండ్స్ కి పూర్తి హక్కులు ఇవ్వనున్నట్లు ప్రకాకటించారు. ఆరోగ్య శ్రీ ద్వారా 15 లక్షల చికిత్స ఉచితంగా అందించబోతున్నామని 
భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని, మోసపోతే గోస పడతామని హెచ్చరించారు. పదేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. ఇంకా చేసుకుందామన్నారు. ఇందిరాగాంధీ వచ్చినప్పటి నుండి జిల్లా చేస్తామని మాట తప్పారని కాంగ్రెస్ పై ద్వాజమెత్తారు. సీఎం కేసీఆర్  కలను సాకారం చేసింది మాత్రం ఎమ్మెల్యే పద్మ అన్నారు. విష ప్రచారాలు తిప్పి కొట్టాలి.. మెదక్ లో గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. మంచి మెజారిటీతో ఎమ్మెల్యే పద్మను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పద్మ దేవేండర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, లక్ష్మినగర్ మాజీ సర్పంచ్ బాపారావు  తదితరులు పాల్గొన్నారు.