మెదక్ లో కాంగ్రెస్ విజయం

మెదక్ లో కాంగ్రెస్ విజయం

రోహిత్ మెజారిటీ 10,257
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్  విజయం సాధించారు. సమీప బిఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్ రెడ్డిపై 10 వేల 157 ఓట్ల తేడాతో గెలుపొందారు. 26 సంవత్సరాల యువకుడైన మైనంపల్లి రోహిత్ విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డుల్లోకెక్కాడు. పోస్టల్ ఓట్లతో మొత్తం 1 లక్షా 86 వేల 946 ఓట్లు పోలయ్యాయి. ఇందులో విజేత కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ కు 87,226 ఓట్లు సాధించాడు. 46.60 శాతం ఓట్లు వచ్చాయి. బిఆర్ఎస్ అభ్యర్థి ఎం. పద్మ దేవేందర్ రెడ్డికి 76,989 ఓట్లు లభించాయి. 41.17 శాతం ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి, నిజాంపేట్ జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ కు 13, 657 ఓట్లు లభించాయి. కేవలం 7 శాతం ఓట్లు వచ్చాయి.

16 రౌండ్లలో కాంగ్రెస్ లీడ్
మెదక్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. మొత్తం 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో 16 రౌండ్లలో కాంగ్రెస్ లీడ్ రాగా కేవలం 4 రౌండ్లలో బిఆర్ఎస్ కు లీడ్ వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ లో సైతం కాంగ్రెస్ పార్టీ కి లీడ్ వచ్చింది.