మెదక్ లో మహిళా క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మ 

మెదక్ లో మహిళా క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మ 

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా  మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మహిళ క్లినిక్ ను ఎమ్మెల్యే పద్మాదేవే రెడ్డి బుధవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ రమేష్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. చందు నాయక్, డిసిహెచ్ డా. చంద్ర శేఖర్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వంద ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాకు ఆరు క్లినిక్ లు మెదక్ జిల్లాలో ఆరు ప్రాంతాలలో మహిళల కోసం ప్రత్యేకంగా క్లినిక్ లతో పాటు జిల్లా ఆసుపత్రిలో రెఫరల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మంగళవారం మహిళలకు సంబందించిన 8 ప్రత్యేక రుగ్మతలపై  పరీక్షించే ఈ క్లినిక్ లో  డాక్టరు, నర్సులు ఉంటారని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ఈ విషయంపై మహిళలకు అవగాహన కలిగించాలని వైద్యాధికారులు, అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ఏ.యెన్.ఏం.లకు  తెలిపారు.