మెదక్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బిజెపి

మెదక్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బిజెపి

ముద్ర ప్రతినిధి, మెదక్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా బుధవారం మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు  జరిగింది.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్   మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో పూర్తిగా విఫలమైందని ధ్వజామెటత్తారు. టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్, తాజాగా పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ పైనగాని ఈ విషయాల్లో పూర్తిగా విఫలమైందన్నారు  ప కేసీఆర్ ఫ్యామిలీ కేవలం లీకేజీ ప్యాకేజీపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. లీకేజీలు చేస్తూ రాష్ట్ర ప్రజల రక్త మాంసాలు పిండుతూ వాటిపై దోచుకున్న డబ్బులను తీసుకపోయి బిఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరించడానికి,  పక్క రాష్ట్రాల్లో ముడుపులను అందించడం జరుగుతుందన్నారు. బిఆర్ఎస్ పార్టీకి ఒక్క నిమిషం కూడా ప్రభుత్వంలో ఉండే అవకాశం లేదన్నారు. కేసిఆర్ కు తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కడ దేవి మధు,  పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్,  మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండవీణ, సీనియర్ నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్,  ఓబీసీ మోర్చా బక్కవారి శివ, మెదక్ మండల అధ్యక్షులు ఆకుల ప్రభాకర్, పట్టణ, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.