మెదక్ లో అట్టహాసంగా పల్లె, పట్టణ ప్రగతి దినోత్సవం.. హాజరైన ఎమ్మెల్యేలు పద్మ, మదన్ రెడ్డి, కలెక్టర్ షా

మెదక్ లో అట్టహాసంగా పల్లె, పట్టణ ప్రగతి దినోత్సవం.. హాజరైన ఎమ్మెల్యేలు పద్మ, మదన్ రెడ్డి, కలెక్టర్ షా

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రం మెదక్ మాయ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె, పట్టణ ప్రగతి దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షాతో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జిల్లాలో చేపడుతున్న పల్లె,పట్టణ ప్రగతి వివరాలను డీపీఓ సాయిబాబా  చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో అధిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, మెదక్, రామయంపేట్, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, జితేంద్ర గౌడ్, రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్లు ఆరెళ్ల మల్లికార్జున గౌడ్, శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, ఎంపీపీల జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, డిఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ సాయిబాబా, జిల్లా అధికారులు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మెదక్ పట్టణంలో మానవహారం
పట్టణ ప్రగతి దినోత్సవంలో భాగంగా మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.  మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించిన అనంతరం వాహనాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రాందాస్ చౌరస్తాలో తెలంగాణ పటం రూపంలో మానవహారం చేపట్టారు. ఉత్తమ సేవలు అందించిన కౌన్సిల్ సభ్యులు, కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.