రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

 నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

పెద్దశంకరంపేట, ముద్ర: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం పెద్దశంకరంపేటలో నిర్వహించిన రైతు దినోత్సవ ర్యాలీలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు తమ ఎద్దుల బండ్లను అందంగా అలంకరించి పెద్ద శంకరంపేటలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతులకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.

రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. బడుగు బలహీన పేద వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రవి ప్రసాద్, పేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, పేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, మండల రైతు బందు కన్వీనర్ సురేష్ గౌడ్,  వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీటీసీలు వీణ సుభాష్ గౌడ్, దత్తు, దామోదర్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, మాజీ ఎంపీపీ బాసడ రాజు,  నాయకులు వేణుగోపాల్ గౌడ్,  పున్నయ్య, నారాయణ, ఆర్యన్ సంతోష్ కుమార్, సూర్య ప్రకాష్,  ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా, ఎపిఎం గోపాల్, ఏఈఓ స్వాతి, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.