ఖాజిపల్లిలో ఇంటింటి సర్వే పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా

ఖాజిపల్లిలో ఇంటింటి సర్వే పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇంటింటి సర్వేలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా  మెదక్ మండలం ఖాజిపల్లి గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు.  ఆరు ఓట్ల కన్నా ఎక్కువగా ఉన్న కిషన్ రావు ఇంటికి  తహశీల్ధార్ శ్రీనివాస్, బూతు స్థాయి అధికారులతో కలిసి వెళ్లి ఓటరు జాబితా ప్రకారం అందరు ఓటర్లు ఒకే ఇంట్లో ఉన్నారా అని వాకబు చేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ ఇంటింటి సర్వే పక్రియ కట్టుదిట్టంగా సకాలంలో పూర్తి చేయాలని బూతు స్థాయి అధికారులకు సూచించారు.

ఓటరు జాబితా నుండి తొలగించిన వారిపేర్లు పున:పరిశీలించాలని, మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.  18 సంవత్సరాలు నిండిన యువత తప్పని సరిగా ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, గ్రామ సర్పంచు మహంకాళి స్వప్న సిద్దుయాదవ్,   బూతు స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.