సీఎం కేసీఆర్ దమ్ముంటే చర్చకు సిద్ధమా

సీఎం కేసీఆర్ దమ్ముంటే చర్చకు సిద్ధమా
  • కుటుంబ పాలన కావాలా 
  • బంగారు తెలంగాణ కావాలా
  • అమరవీరులను మరచిన కేసీఆర్
  • మహాజన్ సంపర్క్ మోర్చా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నా
  •  జమ్మూకాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింఘ్

ముద్ర న్యూస్ రేగొండ: తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది అమాయక ప్రజల విద్యార్థుల బలిదానాలు చేస్తే రాష్ట్రం సిద్దిస్తే సీఎం కేసీఆర్ కుటుంబం పాలిస్తోంది. బంగారు తెలంగాణ కావాలా బొందల గద్దల తెలంగాణ కావాలా. సీఎం కేసీఆర్ దమ్ముంటే చర్చకు సిద్ధమా అంటూ సవాలు విసిరిన జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నిర్మల్ సింఘ్. శుక్రవారం రేగొండ మండల కేంద్రంలోని ఎస్ ఎల్ ఎన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ మహా సమార్క్ అభియాన్ మోర్చా సమావేశనికి నిర్మల్ సింగ్, భూపాలపల్లి ఇంచార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి. ముఖ్యాతిధిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

జమ్మూకాశ్మీర్ లో నలబై ఐదు మంది బలిదానాలు చేస్తే జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ఏర్పడిందని అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీఎం కేసీఆర్ ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం పతకాలను తెలువకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అతికొద్ది పనులను ప్రజల్లోకి తీసుకువెల్లి పండగలు చేస్తున్నాడని అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో సోమరి పోతుల రాష్ట్రంగా మారుస్తారని. జమ్మూకాశ్మీర్ లో హిందు వెతిరేకులు ఉన్న కాస్మిర్ లో బీజేపీ ఏర్పడిందని.తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పతకాలు ప్రతి గడప గడపకు చేరుతాయని తెలిపారు. 

సీఎం కేసీఆర్ జమ్మూకాశ్మీర్ లో ఆత్మ బలిదానాలు చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వచ్చిన ప్రభుత్వ నాయకులతో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎలా దోస్తాన చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ములో రైతులను విద్యార్థులను కూలీలని మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నాడని అన్నారు సీఎం కేసీఆర్ మాటలు బుడుబుడకల మాటలు చెప్పుతున్నడని తెలంగాణ ప్రజలు ఆలోచించాలని అన్నారు.భూపాలపల్లి ఎమ్మెల్యే భూస్వామి అని విన్నాను ఎమ్మెల్యే గండ్ర రమణ రెడ్డి కి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని.ప్రతి మండలంలో భూ కబ్జాలు చేస్తూ అధికారం కొనసాగిస్తున్నడని తెలిపారు.రానున్న రోజుల్లో తెలంగాణ లో డబుల్ ఇంజన్ రాజ్యం రావాలని కోరారు. తెలంగాణ లో బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రఘునాద్ రెడ్డి,. నిషిదర్ రెడ్డి,. దొంగల రాజేందర్ ప్రసాద రావు, తిరుపతి రెడ్డి..అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.