పేదలందరికీ సంక్షేమ ఫలాలు.. 

పేదలందరికీ సంక్షేమ ఫలాలు.. 
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..
  • భూపాలపల్లిలో రూ.1.10కోట్ల విలువైన చెక్కులు పంపిణీ..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణలో అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ, ఆర్ధికంగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో గురువారం భూపాలపల్లి మండలానికి చెందిన 96మంది లబ్దిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మీ, షాదిముబారక్, 28మంది లబ్దిదారులకు మంజూరైన సీఎం సహయనిధి చెక్కులు మొత్తం సుమారు రూ. కోటి పదిలక్షల విలువ గలవి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని, పెళ్లైన ప్రతి ఆడబిడ్డకి మేనమామ లాగా రూ.1,00,116లను అందిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూస్తూ సంక్షేమ ఫలాలు అమలు చేస్తుందని, అందుకు ఒకేరోజు కోటి పదిలక్షల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేయడమే నిదర్శనమని స్పష్టం చేశారు. సీఎం నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరిపై ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ప్రశ్నిస్తున్న క్రమంలో ఐటి, ఈడి దాడుల పేరిట రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిత్వాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, మున్సిపాలిటీ చైర్మన్ సెగ్గం వెంకట రాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఎంపీపీ మందల లావణ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్, మండల పార్టీ అధ్యక్షుడు పిన్ రెడ్డి రాజిరెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు