ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
  • బీజేవైఎం మండల అధ్యక్షుడు ఉప్పునూతల జగదీష్

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- బీజేవైఎం నాయకులు ముందస్తుగా అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపలేరని బీజేవైఎం మండల అధ్యక్షుడు ఉప్పునూతల జగదీష్ అన్నారు. శుక్రవారం నిరుద్యోగ సమస్యలపై రాష్ట్ర బీజేవైఎం ఆదేశాల మేరకు భువనగిరి కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా ఉప్పునూతల జగదీష్ మాట్లాడుతూ గ్రూప్-1 లో 1:100  ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2,3 లకు అదనంగా పోస్టులను పెంచి నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మెగా డీఎస్సీ ని నిర్వహించి, జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బడుగు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కొత్త నవీన్, ప్రధాన కార్యదర్శి మునగంటి సురేష్, ముద్ధం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.