సొంత డబ్బులతో రోడ్డు మరమ్మతులు చేపట్టిన కాంగ్రెస్ నేత కల్లూరి.....

సొంత డబ్బులతో రోడ్డు మరమ్మతులు చేపట్టిన కాంగ్రెస్ నేత కల్లూరి.....

బొమ్మలరామారం (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని ఎర్రగుంట గ్రామం నుండి కాజీపేట వరకు రోడ్డు మార్గం సరిగా లేక నిత్యం అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకురా వెళ్ళగా సానుకూలంగా స్పందించిన ఆయన తన సొంత డబ్బులతో రోడ్డు మరమ్మతు కార్యక్రమాలను శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలలో భాగస్వామిని అవుతానని హామీ ఇచ్చారు. రోడ్డు మరమ్మత్తులు చేపట్టడాన్ని ప్రయాణికులు. ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.