పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలి

పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలి
  • మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి
  • కలెక్టర్ స్పెషల్ ఫండ్ ద్వారా వెంటనే జీతాలు చెల్లించాలి
  • MPDO కార్యాలయం ముందు ధర్నా

ముద్ర,పానుగల్ :- ఆరు నెలలగా  పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయితీ వర్కర్స్ వేతనలను ప్రభుత్వం వెంటనే చెలించాలని గురువారం పానుగల్ మండల  కేంద్రంలో  తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్త నుండి ప్రదర్శన నిర్వహించి MPDO కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా CITU జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము ,CPM మండల కార్యదర్శి బాల్య నాయక్ లు మాట్లాడుతూ  చాలీ చాలనీ వేతనాలతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ తమ జీవితాలను కోవ్వోత్తిలాగా కరిగించుకున్న గ్రామ పంచాయతీ కార్మికులపై నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం సవతి తల్లీ ప్రేమ చూపుతుందని వారు అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడం జరిగిందని,గ్రామపంచాయతీ కార్మికులు వారి పిల్లలకు విద్యకు సంబంధించిన వస్తువులు (సమగ్రి) కొనుగోలు చేసేందుకు కూడా వారితో డబ్బులు లేవు అని, ఈ ప్రభుత్వం వారి పిల్లలను చదువుకు దూరం చేసే విధంగా విధానాలను అవలంబిస్తుందని అన్నారు.

 రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక  నిధులు విడుదల చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనలు ఇవ్వాలని లేని యెడల రానున్న వర్షం కాలం సీజన్ లో గ్రామ పంచాయతీ సిబ్బంది మరో మారు ఆందోళన బాట పట్టక తప్పదాని హెచ్చరించారు.గ్రామ పంచాయతీ కార్మికులకు అర్హులైన వారికి పింఛన్ సౌకర్యం కల్పించాలని,సబ్బులు, నూనెలు, యూనిఫామ్ లు, బూట్లు,గ్లౌజులు ఇవ్వాలని, మల్టిపర్పస్ విధానాని రద్దు చేసి పీఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించి గ్రామపంచాయతీ కార్మికులపై అధికారుల వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26000/- ఇవ్వాలని డిమాండ్ చేశారు.జీవో నెంబర్ 51 సవరించాలని,ఎన్నికల సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికుల కు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం చరవాణి ద్వారా ఎంపీడీవో డిపిఓ గార్లతో మాట్లాడడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను వారం రోజులలో చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. వారం రోజులు చెల్లించకుంటే చలో కలెక్టర్ కార్యాలయం పాదయాత్ర నిర్వహిస్తామని అన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ సూపరెండెంట్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్. ఎల్లయ్య, రంగస్వామి సురేష్ ,బాలస్వామి మద్దిలేటి ,ఆది అర్జునయ్య ఆది చంద్రశేఖర్. నాగన్న. వెంకటయ్య, నాగేంద్రం. భాగ్యమ్మ, రాములమ్మ, దేవమ్మ, చిట్టెమ్మ శాంతమ్మ. కృష్ణమ్మ, తదితరులు పాల్గొన్నారు