బాధితులకు ఎల్ఓసి లను అందజేసిన ప్రభుత్వ విప్.....

బాధితులకు ఎల్ఓసి లను అందజేసిన ప్రభుత్వ విప్.....

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సందర్భంగా 11 లక్షల రూపాయల ఎల్ఓసిని బుధవారం నాడు నాడు ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని తన నివాసంలో గుండాల మండలంలోని వెల్మజాల గ్రామానికి చెందిన వి యాదవ కు లక్ష రూపాయల ఎల్ఓసిని అందజేశారు. రాజపేట మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన విద్యార్థి సిద్ధార్థ హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతూ ఖరీదైన ఇంజక్షన్ కోసం 2. 50 వేల రూపాయల అందజేశారు. బొమ్మలరామారం మండలంలోని చీకటి మామిడి గ్రామానికి చెందిన వంగరి నవీన్ కు 2.50వేల రూపాయల ఎల్ఓసిని అందజేయగా. యాదగిరిగుట్ట మండలంలోని చిన్న గౌరాయపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి బేబీ లహరి 12 సంవత్సరాల వయసులో గుండెకు సంబంధించిన గుండె మార్పిడి కోసం 2.50 వేల రూపాయల ఎల్ఓసిని అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఖరీదైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకంతో పాటు ఎన్నో పథకాలు చేపట్టి ప్రజలకు సేవలు అందించడం గొప్ప విషయం గా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు యాదగిరిగుట్ట మండల బిఆర్ఎస్ అధ్యక్షులు కర్రె వెంకటయ్య. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమెంధర్ గౌడ్. వైస్ చైర్మన్ కాటంరాజు. నాయకులు మిట్ట బిక్షపతి. కసావ్ శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.