విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కిరాణా షాపు దగ్ధం .

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కిరాణా షాపు దగ్ధం .
  • ఐదు లక్షలు ఆస్తి నష్టం .

మోత్కూర్ (ముద్ర న్యూస్ ):మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని చెరువు కట్ట వద్ద శ్రీ రామలింగేశ్వర కిరాణం జనరల్ స్టోర్ లో బుధవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో షాపు యజమాని సుగురు సురేష్ షాప్ లో నుండి బయటకు పరిగెత్తాడు .ఇంతలోనే మంటలు తీవ్రం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఎమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని సుమారు గంటపాటు దుకాణంలోని మంటలను ఆర్పి వేశారు .దుకాణంలోని ఫర్నిచర్, ఫ్రిడ్జ్, రాక్స్ ,నోటు పుస్తకాలు తదితర సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో ఐదు లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని సురేష్ తెలిపారు .అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించినప్పటికీ దుకాణంలోని వస్తువులు అప్పటికే పూర్తిగా కాలిపోయాయని అందులో టపాకాయలు ఉండడంతో మంటలు త్వరగా వ్యాప్తి చెందాయని స్థానికులు తెలిపారు .పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.