బెంచీలు అందించిన “మార్గదర్శి”
ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లగుట్ట శివారు వడ్డెగూడెం గ్రామానికి చెందిన మార్గదర్శి సామాజిక సేవా సంఘం సభ్యులు ఆధ్వర్యంలో రూ. 30 వేల విలువగల సిమెంట్ బెంచీలను గ్రామ ప్రజల సౌకర్యార్థం వితరణ చేశారు. ఇటీవల వడ్డెగూడెం గ్రామంలోని బొమ్మిశెట్టి బాల వెంకటమ్మ అకాల మరణం చెందడంతో సంఘం సభ్యులు ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రాగడ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మిశెట్టి రాజు, శివరాత్రి సంపత్ మాట్లాడుతూ సామాజిక సేవ చేయడంలో ఆనందం ఉందన్నారు. రానున్న రోజుల్లో మార్గదర్శి సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో మరిన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మిశెట్టి స్వామి, గొలుసుల శ్రీను, శివరాత్రి స్వామి, శివరాత్రి రవీందర్, రజనీకర్, సాంబరాజు, బోసు శివ తదితరులు పాల్గొన్నారు.