ఘనంగా“ పల్లా ” జన్మదిన వేడుకలు

ఘనంగా“ పల్లా ” జన్మదిన వేడుకలు

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం జనగామ జిల్లా చిల్పూర్, స్టేషన్ ఘన్ పూర్ మండలాల్లో పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలో చిల్పూర్ దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, జడ్పిటిసి మారపాక రవి, ఎంపీపీ రేఖ గట్టయ్య, మాచర్ల గణేష్ నాయకులు ఆకుల కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. 

స్థానిక బస్టాండ్ వద్ద డాక్టర్ సుగుణాకర్ రాజు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహోన్నదానం చేశారు. చిల్పూర్ శ్రీ బొగ్గులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో చైర్మన్ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజవరం, చిన్న పెండ్యాల గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో లింగారెడ్డి, సమ్మయ్య, శ్యాం కుమార్ రెడ్డి, పోలేపల్లి రంజిత్ రెడ్డి, జనగాం యాదగిరి, ఉద్దమరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.