జనగామలో గెలిచేది కాంగ్రెసే..

జనగామలో గెలిచేది కాంగ్రెసే..

పీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతా రాయ్ 
ముద్ర ప్రతినిధి, జనగామ:  రాబోయే ఎన్నికల్లో జనగామలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని పీసీసీ ప్రధాన కార్యదర్శి, జనగామ నియోజకవర్గ సమన్వయకర్త మానవత రాయ్ ధీమా వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గ ముఖ్య నాయకులతో బుధవారం ఆయన రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో కొననసాగుతున్న మోసపూరిత కేసీఆర్‌‌ ప్రభుత్వాన్ని గద్ద దించే సమయం ఆసన్నమైందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడు లాగా పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. జనగామ నియోజకవర్గం కబ్జాల నాయకుడి కబంద హస్తాల్లో నలిగి పోతుందన్నారు. కబ్జాదారుడు ముత్తిరెడ్డికి జనగామ ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ది చెప్పి ఇక్కడి నుంచి తరిమికొట్టాలన్నారు. జనగామ అభివృద్ధి జరిగిందంటే అది పొన్నాల హయంలోనే అన్నారు. 

జూలై 2న నిర్వహించనున్న రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ పోటీలో ఎక్కువ మంది యువత పాల్గొనే విధంగా కృషి చేయాలని కోరారు. అంతకుముందు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో పార్టీ జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి లింగాజీ, మద్దూరు జడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్, పలు మండలాల అధ్యక్షులు జంగిటి అంజయ్య, ఆది శ్రీనివాస్, బండి శ్రీను, చిరంజీవులు, సంపత్, కొన్నే మహేందర్ రెడ్డి, వంగ వెంకట్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు పిన్నింటి నారాయణ రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడు జక్కుల వేణుమాధవ్, చేర్యాల మున్సిపల్ కౌన్సిలర్ ముస్త్యాల యాదగిరి, జనగామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ మాజీద్ తదితరులు పాల్గొన్నారు.